ఫీల్డ్ అసిస్టెంట్లకు చుక్కలు: 3 రోజులుగా అడ్డుకుంటున్న వైనం.. ఉద్రిక్తత
హుజురాబాద్ బై పోల్ నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే భారీగా ఫీల్డ్ అసిస్టెంట్లు చేరుకున్నారు. వారిని లోనికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళనకు దిగారు. మూడు రోజులుగా నామినేషన్లు వేయకుండా తమను అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేసేందుకు లోపలికి వెళ్లారు. ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు.
కిషన్ రెడ్డి హాజరు..
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ వేయనున్నారు. ఈటల నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ వేశారు. హుజూరాబాద్‌లో నామినేషన్ రాజకీయం వేడెక్కింది. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో నామినేషన్ వేయడం కోసం అభ్యర్ధులు బారులు తీరారు. హుజూరాబాద్ నామినేషన్ సెంటర్ వద్ద రద్దీ నెలకొంది. నామినేషన్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఫీల్డ్ అసిస్టెంట్లు తరలివచ్చారు.
రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు లైన్ కట్టారు. అయితే కోవిడ్ నిబంధనలు, వ్యాక్సిన్ సర్టిఫికెట్ కావాలి అంటూ అధికారులు రూల్స్ పెట్టారు. నామినేషన్ వేయడానికి రూల్స్ అడ్డుపడుతున్నాయి. ఈ నెల 11న ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు.

తీవ్ర యత్నం
హుజూరాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత 4 రోజులుగా నామినేషన్ పత్రాలతో వస్తున్నా తమను అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఇవాళ కూడా నామినేషన్ వేసేందుకు ఫీల్డ్ అసిసెంట్లు భారీ ఎత్తున తరలివచ్చారు.

ఇవాళే ఆఖరు
హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించారు. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహిస్తారు. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.

ఇద్దరికీ ఇంపార్టెంటే..
హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

దళితబంధు
హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు.
వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications