వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ను తరిమి కొట్టాలి - టిక్కెట్లు దక్కేది వారికే : పార్టీ నేతలకు ఇదే లాస్ట్ వార్నింగ్ - రాహుల్..!!

|
Google Oneindia TeluguNews

పార్టీ నేతలకు కాంగ్రెస్ అగ్ర నేత స్పష్టంగా - సూటిగా తమ విధానం తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ లక్ష్యంగా పోరాడాలని నిర్దేశించారు. కేసీఆర్ - టీఆర్ఎస్ ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పని చేసే వారికి - ప్రజలతో ఉండే వారికి టిక్కెట్లిస్తామని...వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ ముఖ్య నేతలతో గాంధీ భవన్ లో సమావేవమైన రాహుల్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీలో సమస్యలు - ఇబ్బందులు ఉంటే ఒకే కుటుంబ సభ్యుల తరహాలో తలుపులు వేసుకొని మాట్లాడుకోవాలని సూచించారు.

మీడియాకు ఎక్కితే ఒక వేటు

మీడియాకు ఎక్కితే ఒక వేటు


ఒక కుటుంబంగా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఎవరైనా అంతర్గత విభేదాలు.. సమస్యల పైన మీడియాకు ఎక్కితే సహించేది లేదని రాహుల్ గాంధీ భవన్ వేదికగా తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పని చేయటం ప్రారంభించాలని సూచించారు. ఎంతటి వారైనా సరే..క్షేత్ర స్థాయిలో వారి సామర్ధ్యం...ప్రజల్లో ఉన్న మద్దతు చూసిన తరువాతనే టిక్కెట్లు ఖరారు అవుతాయని స్పష్టం చేసారు. హైదరాబాద్ - ఢిల్లీ చుట్టూ ప్రదిక్షణలు చేయద్దని..ప్రజలతోనే ఉండాలని సూచించారు. తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కటుుంబం మాత్రమేనంటూ రాహుల్ ఆరోపించారు.

పొత్తు పైన మరోసారి క్లారిటీ

పొత్తు పైన మరోసారి క్లారిటీ


తెలంగాణలో కాంగ్రెస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ దగ్గర అన్ని శక్తులు ఉన్నాయని... కానీ జన బలం లేదని పేర్కొన్నారు. ప్రజల శక్తిని మించింది ఏదీ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా..తెలంగాణ ప్రజల కలలను నిజం చేయటం లక్ష్యమన్నారు. విద్య - వైద్యం మన ప్రాధాన్యతలు అని చెప్పుకొచ్చారు. పార్టీలో ఐకమత్యం అవసరమంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. యువతకు పార్టీలోకి ఆహ్వానం పలికారు. నిరంకుశ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. వరంగల్ సభ సక్సెస్ కావటం పైన సంతోషం వ్యక్తం చేసారు.

ఇదే తెలంగాణలో గెలుపుకు మలుపు

ఇదే తెలంగాణలో గెలుపుకు మలుపు


ఇదే తెలంగాణలో గెలుపుకు నాంది కావాలని ఆకాక్షించారు. కాంగ్రెస్ డిక్లరేషన్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు నిర్దేశించారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రం లూటీ అయిందని... ప్రజా సంపదను దోచేసారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువత పైనా..కాంగ్రెస్ పైనా ఉందన్నారు. కాంగ్రెస్ లోకి రండి.. తెలంగాణ మార్పును మొదలు పెట్టండి అంటూ రాహుల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం జరిగినా.. తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో న్యాయం ఉండటంతో తెలంగాణకు అనుకూలంగా సోనియా నిర్ణయం తీసుకున్నారంటూ రాహుల్ వివరించారు.

తెలంగాణకు రావటానికి ఎప్పుడైనా సిద్దమే

తెలంగాణకు రావటానికి ఎప్పుడైనా సిద్దమే


తెలంగాణ కోసం ఎప్పుడు అవసరమైనా రావటానికి తాను సిద్దంగా ఉంటానని.. ఎక్కడకు..ఎప్పుడు రావాలో చెబితే వచ్చేస్తానంటూ హామీ ఇచ్చారు. టికెట్ మాత్రం మెరిట్ ఆధారంగానే ఇస్తామని..ఆ తరువాత తనను తప్పుబట్టినా ఉపయోగం లేదంటూ పదే పదే చెప్పుకొచ్చారు. గ్రామాల్లో.. ప్రజల్లో ఉండాలని నిర్దేశించారు. హైదరాబాద్ లో బిర్యానీ - టీ బాగుంటాయని..అయినా వాటిని వదిలేసి ప్రజల్లోకి వెళ్లాలని సెటైర్ వేసారు. తెలంగాణ గెలుపుకు మొదలు ఇక్కడి నుంచే మొదలు కావాలంటూ రాహుల్ గాంధీ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు.

English summary
Congress MP Rahul Gandhi had warned the partymen to fight against KCR and who works for the party will only be given the tickets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X