రాచకొండలో ఫిల్మ్, స్పోర్ట్స్ సిటీలు: కెసిఆర్ (ఫొటోలు)
హైదరాబాద్: నల్లగొండ జిల్లా రాచకొండలో ఫిల్మ్, స్పోర్ట్స్ సిటీలు నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. రాచకొండ గుట్టలు, పరిసర ప్రాంతాల్లో ఆయన సోమవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆ విషయం చెప్పారు. రాచకొండలో 31 వేల ఎకరాల భూమి ఉందని ఆయన చెప్పారు.
పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలను ఏర్పాటు చేసేందుకు రాచకొండ అనువైన స్థలమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు తలమానికంగా నిలిచే సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లా మంత్రులు జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ బిఆర్ మీనా, నల్లగొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ ముఖ్యమంత్రితో పాటు ఉన్నారు.

కెసిఆర్ రాచకొండ సర్వే
రాచకొండను రాజధానిగా చేసుకుని తెలంగాణ ప్రాంతాన్ని రేచర్ల పద్మనాయకులు పాలించారు. ఆ ప్రాంతం భౌగోళిక స్వరూపం ఇదే. DSC_3470.JPG

కెసిఆర్ రాచకొండ సర్వే
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సందర్సించారు. ఆయన సోమవారంనాడు ఏరియల్ సర్వే నిర్వహించారు.

కెసిఆర్ రాచకొండ సర్వే
రాచకొండ భౌగోళిక స్వరూపాన్ని, అక్కడ అందుబాటులో ఉన్న భూమిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలించారు.

కెసిఆర్ రాచకొండ సర్వే
రాచకొండ ప్రాంతం గుట్టలు, కొండలతో నిండి ఉంటుంది. ఆ ప్రాంతంలో కెసిఆర్ ఇలా నడుస్తూ కనిపించారు.

కెసిఆర్ రాచకొండ సర్వే
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హెలికాప్టర్‌లో రాచకొండ ప్రాంతానికి వచ్చారు. ఆయన ఈ ప్రాంతంలో సిటీ, స్పోర్ట్స్ సిటీలను నిర్మిస్తామని ఆయన చెప్పారు.

కెసిఆర్ రాచకొండ సర్వే
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో పాటు మంత్రులు పి. మహేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి కూడా రాచకొండకు వచ్చారు.

కెసిఆర్ రాచకొండ సర్వే
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాచకొండ ప్రాంతంలో ఈ విధంగా సమావేశమై పరిశీలించారు.
అంతర్జాతీయ స్థాయిలో చిత్రనగరి (ఫిల్మ్ సిటీ), క్రీడానగరి (స్పోర్ట్స్ సిటీ)లను ఏర్పాటు చేస్తామని కెసిఆర్ చెప్పారు. కాలుష్యం వెదజల్లని సంస్థలను రాచకొండ గుట్టల్లో నెలకొల్పాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌కరు కేవలం 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనే రాచకొండ గుట్టలు ఉంటాయి.
రాచకొండను రాజధానిగా చేసుకుని రేచర్ల పద్మనాయకులు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. అనపోతన వంటి గొప్ప రాజులు ఈ రాజధానిని నుంచి పాలన సాగించారు. ఆ కాలంలోనే ఇక్కడ అత్యంత పటిష్టంగా భారీ ప్రాకారాలు, అద్భుతమైన కోటుల, శత్రుదుర్భేద్యమైన ప్రహరీలు ఉన్నాయి. కొండల్లో పలు దేవాలయాలు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications