ఎన్టీఆర్ సలహా: చారి నుంచి వేణుగోపాల్‌గా పేరు మార్పు (ఫోటోలు)
పాటల రచయిత, కవి, పండితుడు, గ్రంథ పరిష్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచ్చి వేణుగోపాలాచార్యులు (91) శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు. ఒక కుమార్తె ఉన్నారు. పట్నంలో శాలిబండ, పేరైన గోలుకొండ, ఎవరీ చక్కనిచుక్క వంటి హుషారెత్తించే పాటలతో పాటు నమో వేంకటేశా, నమో తిరుమలేశా వంటి విలక్షణ పాటలను అందించారు.
సినిమా రంగంలోని కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంటి అన్ని రంగాలలో విలక్షణతను కనబరిచి బహుముఖప్రజ్ఞాశాలిగా నిలిచారు. ఆచ్చి వేణుగోపాలాచార్యులు 1930 జూన్12న ఆయన కుత్బుల్లాపూర్‌లో జన్మించారు. పాఠశాల విద్యను ఉర్దూమీడియంలో అభ్యసించారు. 1952లో ఉపాధ్యాయులుగా ఉద్యోగంలో చేరారు.
1952-1953 తెలంగాణ ఇడ్లీసాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో, 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమకారులకు తనవంతు సాయం అందించారు. జూన్ 2, 2014న కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంతోషపడ్డారు. ఆరుదశాబ్దాల కలనెరవేరిందని ఆయన తన సంతోషాన్ని మిత్రులతో పంచుకున్నారు.
వేణుగోపాలాచార్య రాసిన కొన్ని గీతాలలో బాగా ప్రాచుర్యం పొందినవి:
ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా
నీకొండకు నీవే రప్పించుకో
నమో వేంకటేశా.. నమో తిరుమలేశా
పట్నంలో శాలిబండ.. పేరైన గోలకొండ (అమాయకుడు)
చుక్కల చీర కట్టుకుని (ముద్దుబిడ్డ)
శ్రీవేంకటేశా దయాసాగరా (తిరుపతమ్మకథ)

కవి, సినీ రచయిత ఆచ్చి వేణుగోపాలాచార్య కన్నుమూత
తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాషలలో సమాన వైదుష్యాన్ని ప్రదర్శించారు. బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో వంటి పాటలను రాసి తెలంగాణ వైతాళికుల జాబితాలో చేరిన సాహితీవేత్త ఆయన.
సౌభాగ్యవతి, అమాయకుడు, దేవుడున్నాడు, రాఘవేంద్ర మహిమలు సినిమాలకు దర్శకత్వం వహించారు.

కవి, సినీ రచయిత ఆచ్చి వేణుగోపాలాచార్య కన్నుమూత
ఆ సినిమాలకు పాటలు కూడా రాశారు. కేబి తిలక్ దర్శకత్వంలో వచ్చిన ముద్దుబిడ్డ సినిమాలో ఆయన రాసిన చుక్కల చీరకట్టుకొని జానపదగీతం బహుళ ప్రజాదరణ పొందడంతో పేరువచ్చింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వీరి కుటుంబానికి ఇలవేల్పు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలతోపాటు ప్రతి ఉత్సవానికి వీరి కుటుంబానిదే బృహస్పతి స్థానం.

కవి, సినీ రచయిత ఆచ్చి వేణుగోపాలాచార్య కన్నుమూత
ఆరు దశాబ్దాలుగా గుట్టలో బ్రహ్మస్థానంలో కూర్చొని వరుసగా బ్రహోత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. పాంచరాత్ర ఆగమ సంప్రదాయాలపైన ఆయనది సాధికారిక ప్రజ్ఞ. వేదపండితులు, పంచాంగకర్తలు, సిద్ధాంతులు ఆయనతో సంభాషించి తమ సందేహాలను నివృత్తి చేసుకునేవారు.

కవి, సినీ రచయిత ఆచ్చి వేణుగోపాలాచార్య కన్నుమూత
నువ్వు చారి అనే పేరుతో సినిమా పరిశ్రమలో నిలదిక్కుకోలేవు అని ఎన్టీ రామారావు సలహా ఇవ్వడంతో సినిమాల వరకు ఆయన పేరును వేణుగోపాల్‌గా మార్చుకున్నారు. పలు ఆధ్యాత్మిక గ్రంథాలను సులభమైన తెలుగులో అనువదించారు. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని తెలుగుపద్యాలలోకి అనువదించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications