వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో నోటిఫికేషన్!: పోలీసు శాఖలో 2,904 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోలీసు శాఖలో 2,904 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. నియామకానికి సంబంధించి ఈ మేరకు స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు అనుమతి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీసు శాఖలో 8,401 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో 186, అగ్నిమాపక దళంలో 510 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఆర్థిక శాఖ ఆమోదంతో 2,904 పోస్టులకు లైన్ క్లియర్ అయింది.

ఆమోదం లభించిన పోస్టుల వివరాలిలు: ఎస్‌ఐ సివిల్- 101, ఆర్‌ఎస్‌ఐ- 90, ఎస్‌ఐ సీపీఎల్- 02, ప్రత్యేక పోలీస్ కానిస్టేబుళ్లు- 2,379, పోలీస్ కానిస్టేబుళ్లు(కమ్యూనికేషన్)- 332. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

 finance department gives approval to the police recruitment

కాగా, పోలీసు ఉద్యోగాల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఒకేసారి 9,096 పోలీసు ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపడంతోపాటు భారీ సంస్కరణలకు ఆమోదముద్ర వేసింది. దీనిలో భాగంగా తొలిదశలో దాదాపు మూడు వేల పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేయనుంది.

కాగా, మహిళలకు సివిల్ విభాగంలో 33 శాతం(మూడో వంతు), ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అత్యంత కఠినంగా ఉన్న దేహదారుఢ్య పరీక్షలు సైతం ఇకపై సరళీకృతం కానున్నాయి. ఈ నూతన విధానాన్ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) ఆమోదించాల్సి ఉంది.

English summary
Telangana Finance Department has been given approval to the police recruitment for 2,904 posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X