రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ సభకు డ్వాక్రా మహిళలు రాకుంటే ఫైన్; వాట్సప్ సందేశాల వ్యవహారంపై భగ్గుమన్న బీజేపీ!!

|
Google Oneindia TeluguNews

ఇటీవల సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ఆయన పర్యటన సందర్భంగా డ్వాక్రా మహిళలకు పంపించిన వాట్సాప్ సందేశాలు ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్ అయ్యాయి. కెసిఆర్ సభకు మహిళలను నిర్బంధంగా తరలించే ప్రయత్నం చేశారా? కెసిఆర్ సభకు హాజరు కాని మహిళలకు ఫైన్లు వేశారా? అన్నది ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

డ్వాక్రా మహిళలకు వాట్సప్ సందేశాలు.. సభకు రాకుంటే ఫైన్లు కట్టాలని

డ్వాక్రా మహిళలకు వాట్సప్ సందేశాలు.. సభకు రాకుంటే ఫైన్లు కట్టాలని


తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో నూతనంగా నిర్మాణమైన కలెక్టరేట్ సమీకృత కార్యాలయాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ సమయంలో, కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున డ్వాక్రా గ్రూప్ లకు సంబంధించిన మహిళలు హాజరుకావాలని సందేశాలు పంపారు.

అంతేకాదు సభకు రానివారు జరిమానా కట్టాల్సి ఉంటుందని, సీఎం కేసీఆర్ సభకు హాజరు కాకపోతే భవిష్యత్తులో వాళ్లకు లోన్లు ఇవ్వరని కూడా బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్వాక్రా సంఘాల మహిళలకు వాట్సాప్ లో సందేశాలు పంపించారు. ఇక ఈ విషయం బయటకు రావడంతో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో వివాదాస్పదంగా మారింది.

సభకు రాకుంటే భవిష్యత్ లో లోన్లు ఇవ్వమని బెదిరింపు

సభకు రాకుంటే భవిష్యత్ లో లోన్లు ఇవ్వమని బెదిరింపు

25వ తారీకు సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించిన సమయంలో వాట్సప్ ద్వారా డ్వాక్రా సంఘాల మహిళలకు రేపు కొంగర దగ్గర కలెక్టర్ కార్యాలయం ఓపెనింగ్ వుంది. డ్వాక్రా మహిళలు అందరూ తప్పనిసరిగా కేసీఆర్ కు స్వాగతం పలకాలి. ఉదయం 11 గంటల కల్లా మునిసిపల్ ఆఫీస్ దగ్గరకు రావాలని పేర్కొన్నారు. రాని వారి పేర్లను నమోదు చేసుకుంటామని, భవిష్యత్తులో వారికి లోన్లు, ఎన్నికల సమయంలో డబ్బులు ఇవ్వరు అంటూ 24 వ తారీకు న డ్వాక్రా మహిళలకు వాట్సప్ ద్వారా సందేశాలు వెళ్లాయి.
సభకు రానివాళ్ళకు 500రూపాయల ఫైన్, విచారణ జరపాలని బీజేపీ డిమాండ్

సభకు రానివాళ్ళకు 500రూపాయల ఫైన్, విచారణ జరపాలని బీజేపీ డిమాండ్


ఇక సభకు రాలేని వాళ్లు 500 రూపాయల ఫైన్ కట్టాలని మరో మెసేజ్ కూడా పంపించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. సమావేశానికి వెళ్లలేని కొందరు మహిళలు తిట్టుకుంటూ తమ గ్రూపు లీడర్లకు ఫైన్ కూడా పెట్టారని సమాచారం. ఇక ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ వ్యవహారంపై తక్షణం విచారణ జరిపించి కారకులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బిజెపి మహిళా మోర్చా ప్రతినిధులు, బిజెపి మహిళా కార్పొరేటర్లు బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు, డ్వాక్రా సంఘాల లీడర్లు ఇలా బెదిరింపులకు గురి చేస్తూ డ్వాక్రా మహిళలకు సందేశాలు పంపారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
two days ago CM KCR's inauguration of Ranga Reddy District Collectorate, the BJP ranks were fires over sending WhatsApp messages asking Dwakra women to attend the meeting and those who did not attend would be fined. BJP leaders are demanding an inquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X