యాదద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం.. నిలిచిన విద్యుదుత్పత్తి, జరిగిందిదేనా!
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దామరచర్ల లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నేడు తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదంలో పవర్ ప్లాంట్ లోని మొదటి యూనిట్లో మంటలు చెలరేగాయి. మొదటి యూనిట్ లోని బాయిలర్ నుండి ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయని సమాచారం.
యాదాద్రి పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
ఇక ఇదే సమయంలో దిగువన వెల్డింగ్ పనులు కొనసాగుతున్న క్రమంలో లీకైన ఆయిల్ కారణంగా మంటలు ఒక్కసారిగా ఎగసి పడ్డాయని సమాచారం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగ ప్రవేశం చేసి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో కొన్ని కేబుల్స్ కాలిపోగా ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు.

థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ 1 ట్రయల్ రన్ లో అపశ్రుతి
అగ్నిమాపక సిబ్బంది శ్రమించి ఫైనల్ గా మంటలను అదుపులోకి తీసుకు రాగలిగారు. ఈ సంఘటన కారణంగా మొదటి యూనిట్లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ 1 ప్రారంభించడానికి అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇక ఈ దుర్ఘటన పైన దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీస్ అధికారి పిటిఐకి తెలిపిన వివరాల ప్రకారం
ఎలాంటి ప్రాణ నష్టం లేదు
నల్గొండ జిల్లాలోని యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ యొక్క యూనిట్ ఒకటిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఇది తెల్లవారుజామున ఒంటిగంట, ఒకటిన్నర ప్రాంతంలో సంభవించిందని, ఈ ఘటనలో కొన్ని కేబుల్స్ మాత్రమే కాలిపోయాయి అని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఫిబ్రవరిలోనూ ప్రమాదం
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు ఐదు యూనిట్లు ఉన్నాయి. ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉంది. గత ఏడాది యూనిట్ రెండు పూర్తి కాగా, ఇక ప్లాంట్లో కొనసాగుతున్న మొత్తం పనులు 2025 మధ్య నాటికి పూర్తవుతాయని గతంలోనే ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా యాదాద్రి పవర్‌ప్లాంటులో ప్రమాదం జరిగింది. యాష్ ప్లాంట్ ఈఎస్‌పీ వద్ద ఆరుగురు కార్మికులు కాలిన బూడిద పడటంతో తీవ్రంగా గాయాల పాలయ్యారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications