దీపావళి విషాదం: విషమంగా ముగ్గురు, యువతి కంటికి తీవ్ర గాయాలు..
ఇందులో స్వప్న అనే ఇంటజనీరింగ్ విద్యార్థిని కంటికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె చూపకు ప్రమాదం ఏర్పడినట్లు తెలుస్తోంది.
Recommended Video

హైదరాబాద్: వెలుగుల దీపావళి కొంతమందికి చీకట్లు నింపింది. టపాసులతో జాగ్రత్త అంటూ ఎంత అవగాహన కల్పించినా.. ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇంటిల్లిపాదీ టపాసులు కాలుస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు గాయపడటం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

హైదరాబాద్ వ్యాప్తంగా పండుగ వేడుకల్లో టపాసులు కాలుస్తూ సుమారు 25మందికి పైగా గాయపడ్డారు. ఇందులో స్వప్న అనే ఇంటజనీరింగ్ విద్యార్థిని కంటికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె చూపుకు ప్రమాదం ఏర్పడినట్లు తెలుస్తోంది. క్రాకర్స్ కాలుస్తున్న సమయంలో ఓ రాకెట్ వల్ల ఆమె కంటికి గాయాలైనట్లు సమాచారం.
సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభంవించిందని వైద్యులు తెలిపారు.
మరో ముగ్గురు తీవ్రగాయాల పాలవగా.. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications