బ్యాంకు ఉద్యోగిగా వచ్చి కెబిఎస్ బ్యాంకు సిఇఓపై కాల్పులు, నిందితుడి కోసం పోలీసువేట
హైద్రాబాద్ మాసబ్ ట్యాంకు శాంతినగర్ లోని కెబిఎస్ బ్యాంకు సిఇఓ పానియా పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన కు పాల్పడింది ఎవరనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరో వైపు పానియాను కేర్ ఆస
హైదరాబాద్ :హైద్రాబాద్ నగరంలో మాసబ్ ట్యాంకు వద్ద ఓ వ్యక్తి పై కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది.ఆదివారం మధ్యాహ్నం మాసబ్ ట్యాంకులోని శాంతినగర్ సమీపంలో బైక్ పై వచ్చిన దుండగుడు కాల్పులు జరిపి పారిపోయాడు. బాదితుడిని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మాసబ్ ట్యాంక్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే కెబిఎస్ బ్యాంకు సిఇఓ పానియా నివాసం ఉంటున్నాడు.ఇవాళ ఉదయం నివాసం ఉండే అపార్ట్ మెంట్ లోకి వచ్చాడు. గుర్తుతెలియని వ్యక్తి ఆయన నివాసంలోకి వచ్చి కాల్పులు జరిపాడు.

ఉదయం పూట నేరుగా కెబిఎస్ బ్యాంకు ఉద్యోగి పానియా ఇంటికి వచ్చిన నిందితుడు ఆయనతో నేరుగా మాట్లాడేందుకు ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయనతో సుమారు పదినిమిషాల పాటు మాట్లాడాడు
వారిద్దరి మద్యం ఏం జరిగిందో తెలియదు కాని, ఇద్దరి మద్య గొడవ జరిగింది. ఈ ఘటనలో వారిద్దరి మద్య మామామాటాపెరిగింది. గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బ్యాంకు సిఇఓ పానియా గాయపడ్డారు. ఆయనను కుటుంబసభ్యులు కేర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు.నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
బ్యాంకు సిఇఓ పై ఎవరు కాల్పులు జరిపారు , ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందనే విషయాలపై పోలీసులు విచారణచేస్తున్నారు. అయితే అపార్ట్ మెంట్ వద్ద ఉన్న సిసి కెమెరాల ఆ సమయంలో పనిచేయలేదని పోలీసులు గుర్తించారు. అయితే శాంతినగర్ కు చేరుకొనే దారిలో ఉన్న సిసి కెమెరాల పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications