ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొదలు పరీక్ష ...తర్వాతే పెళ్ళి ఆదర్శంగా నిలిచిన జంట

ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రచన వివాహం నవంబర్ 25,2016, అదే రోజు ఆమెకు డి.ఎడ్ . పరీక్ష కూడ ఉంది. అయితే పెళ్ళిపత్రికలు పంచిన తర్వాత పరీక్షల షెడ్యూలు వచ్చింది. పరీక్ష రాసిన తర్వాతే పెళ్ళిచేసుకోవాలని నిర

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్ :పెళ్ళి రోజే ..పరీక్ష... జీవితాంతం కలిసి నడిచే రోజు కోసం ముహుర్తం కుదిరిన రోజు, అయితే దంపతులు కాబోయే వధువు, వరులు మాత్రం పరీక్ష వైపే మొగ్గుచూపారు. పరీక్ష తర్వాతే ఆ వధువు తాళి కట్టించుకొంది.

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఏలూరు రచన వివాహం నవంబర్ 25వ, తేది ఉదయం 11.03 గంటలకు. అయితే వివాహం రోజునే రచనకు పరీక్షలు కూడ ఉన్నాయి. వివాహ ముహుర్తం కుదుర్చుకొన్న తర్వాత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.

marrage

అయితే అప్పటికే వివాహనికి సంబందించి పెళ్ళి పత్రికలు పంచేశారు. ఏం చేయాలి. పరీక్షలు రాయాలా....పెళ్ళి చేసుకోవాలనే మీమాసం వధువులో ఉంది. ఏం చేయాలనే దానిపై రెండు కుటుంబాల పెద్దలు, వధువు, వరుడు చర్చించారు. పెళ్ళి కంటే ముందుగా పరీక్షలు రాసేందుకు మొగ్గుచూపారు. పరీక్ష రాసిన తర్వాతే పెళ్ళి పీటలు ఎక్కాలని నిర్ణయించారు.

దీంతో ఈ సమస్య తీరిపోయింది.ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మోహన్,జమున దంపతుల కూతురు రచనకు మంచిర్యాల పట్టణానికి చెందిన సాగర్ తో శుక్రవారం నాడు వివాహం నిశ్చయమైంది. రచనను పరీక్ష రాసిన తర్వాతే పెళ్ళీపీటలపైకి ఎక్కింది. పరీక్షలకే తొలి ప్రాధాన్యత ఇచ్చిన ఆ దంపతులను పలువురు అభినందిస్తున్నారు.

English summary
rachana,sagar marrage fix before three months. both families distributed wedding cards also.but d.e.d. exam is schedule relese. when rachan, sagar marrage at the same day exam. after complete the exam then start the marrage two families decided. on friday rachana wrote d.e.d. exam after that sagar, rachana get marrage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X