కారులో అతని శవం: రైలు పట్టాలపై మరో నలుగురి మృతదేహాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ మండలం అంకుషాపూర్‌ వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది.హెచ్‌పీసీఎల్‌ దగ్గర రైల్వేట్రాక్‌పై నాలుగు మృతదేహాలు కనిపించాయి. ఒక వ్యక్తి మృతదేహం కారులో పడి ఉండగా మిగతా నాలుగు శవాలు రైల్వే ట్రాక్‌పై కనిపించాయి.

మృతులు ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ హౌసింగ్‌ ఈడీ సత్యనారాయణ కుటుంబంగా గుర్తించారు. మృతుల్లో సత్యనారాయణ భార్య సహా ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రైల్వేట్రాక్‌ సమీపంలోని కారులో సత్యనారాయణ మృతదేహం ఉంది.

సత్యనారాయణ మృతిపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన గుండెపోటుతో మరణించగా, మిగతా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారని ఒక వాదన వినిపిస్తుండగా, ఐదుగురు కూడా ఆత్మహత్య చేసుకున్నారని మరో వాదన వినిపిస్తోంది.

Five family members commit suuicide in Ranga Reddy district

సత్యనారాయణ అంకుశాపూర్‌ వద్ద కారులో పురుగుల ముందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అంటున్నారు. ఆతర్వాత ఆయన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు.సత్యనారాయణ కుటుంబం ఆత్మహత్యకు ఆర్థిక, అనారోగ్య సమస్యలే కారణమని భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సత్యనారాయణ భార్య మీరా (51), కూతుళ్లు స్వాతి (33), నీలిమ (28), కుమారుడు శివరామకృష్ణ (22) శవాలు రైలు పట్టాలపై పడి ఉన్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
five members of a family commited suicide in Ranga Reddy district. They are from adilabad district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X