వరుసగా ఇళ్లలో చేరీ: లిఫ్ట్ ఇస్తే బైక్ ఎత్తుకెళ్లాడు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చాంద్రాయణ గుట్ట పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ మెగా డ్రీమ్ సిటీలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ. 2.32 కోట్లు విలువైన 80 తులాల బంగారం, రూ.16.26 లక్షల నగదు అపహరించుకుపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... స్థానికంగా నివాసం ఉండే మహ్మద్ అబ్దుల్ అనే వ్యక్తి తన కుమారుడి వివాహం కోసం 40 తులాల బంగారం, 16 లక్షల నగదు ను ఇంట్లో ఉంచారు. మహ్మద్ అబ్దుల్ మంగళవారం రాత్రి బంధువుల ఇంటికి వివాహానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంట్లోఉన్న నగదు, విలువైన అభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు.
అదే కాలనీలో నివసించే మహ్మద్ జమాలుద్దీన్ ఇంట్లో 8 తులాల బంగారం, రూ. 6వేల నగదు, ఖరామత్ ఆలీ ఇంట్లో రూ.10 వేల నగదు, గౌస్ ఇంట్లో 15 తులాల బంగారం, రూ.10 వేల నగదు, మరో ఇంట్లో 17 తులాల బంగారం చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

లిఫ్టిస్తే.. బెదిరించి బైక్‌ను ఎత్తుకెళ్లిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చేవెళ్ల సీఐ ఉపేందర్, ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన పూలపల్లి యాదయ్య రాయల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తున్నాడు. గతనెల 12న విధులు ముగించుకొని బైక్‌పై కళాశాల నుంచి ఆలూరుకు యాదయ్య బయలుదేరాడు.
అయితే మెదక్ జిల్లా కొండాపూర్ మండలంలోని గుంతపల్లికి చెందిన వడ్డె యాదగిరి మార్గంమధ్యలో యాదయ్యను లిఫ్ట్ అడిగాడు. దీంతో యాదయ్య అతణ్ని బైక్‌పై ఎక్కించుకొని బయలుదేరాడు. మార్గమధ్యలో దామరగిద్ద బస్‌స్టేజీ సమీపంలో మూత్ర విసర్జనకు బైక్ ఆపాలని యాదగిరి కోరాడు. అక్కడ బైక్ ఆపగానే యాదయ్యను బెదిరించి సెల్‌ఫోన్, బైక్ లాక్కొని పరారయ్యాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న యాదగిరిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. చోరీకి గురైన బైక్‌ను తిరిగి స్వాధీనం చేసుకొని పోలీసులు నిందితుణ్ని రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications