తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్య ఎన్నికయ్యారు.
అయితే, ఈ ఐదుగురు కాకుండా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు నిబంధనల మేరకు లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు. కాగా, నామినేషన్ల గడువు గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

కాగా, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి మూడు, దాని మిత్రపక్షమైన సీపీఐకి ఒకటి, బీఆర్ఎస్ పార్టీ ఒక స్థానం గెలుచుకున్నాయి.
కాగా, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి పేరు ఊహించని విధంగా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరిన సమయంలోనే ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. అయితే, శంకర్ నాయక్ పేరు ఎవరు ప్రస్తావించకపోయినప్పటికీ.. ఆయనకు టికెట్ రావడం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో చర్చనీయాంశంగా మారింది.
కాగా, కాంగ్రెస్ రాష్ట్ర కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో అభ్యర్థుల ఎంపిక చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. పార్టీ కోసం పనిచేసినవారికి, పార్టీలో పాత నేతలకు ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎవరూ ఊహించని విధంగా విజయశాంతి, శంకర్ నాయక్ పేర్లు తెరపైకి రావడం గమనార్హం. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గ నేతకు ప్రాధాన్యత లభించింది.
-
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ ! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!!












Click it and Unblock the Notifications