హైదరాబాద్‌లో దారుణం.. 5 ఏళ్ల బాలుడిని హత్యాచారం !
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో పాశవిక ఘటన చోటుచేసుకుంది. ఓ కామాందుడు ఐదేళ్ల బాలుడిని అత్యాచారం చేసి.. ఆపై దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అనూహ్య విషాదంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు సైతం షాక్ కి గురవుతున్నారు.
ఘటన ఎలా జరిగింది?
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈశ్వర్ పాండే కుటుంబం గత రెండు నెలలుగా రామంతపూర్‌లోని కేసీఆర్ నగర్‌లో నివాసం ఉంటోంది. ఈశ్వర్ స్థానికంగా ఉన్న ఓ టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. అదే డిపోలో నిందితుడు బిహార్‌కు చెందిన కమర్ కూడా పనిచేస్తున్నాడు. ఆగస్టు 12న (గురువారం) ఐదేళ్ల మనోజ్ పాండే కనిపించకపోవడంతో బాలుడి తండ్రి పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో ఉప్పల్ పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు.

ఈ క్రమంలోనే బాలుడి కుటుంబానికి పరిచయమైన కమర్ అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కమర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. బిస్కెట్ల ఆశ చూపిస్తూ బాలుడిని పొదల దగ్గరికి తీసుకెళ్లి.. అక్కడ లైంగిక దాడి చేసి స్పృహ తప్పిన బాలుడిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం శవాన్ని అక్కడే వదిలేసి వచ్చేశాడు. ఆగస్టు 15వ తేదీ రాత్రి మనోజ్ మృతదేహం లభించింది. శవాన్ని పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కాగా ఒక్కగానొక్క కొడుకును కోల్పోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ నెల 12న నా కొడుకు మిస్సయ్యాడు. మేము మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే కమర్‌పై అనుమానం కలిగిందన్నారు. సీసీ ఫుటేజ్ చూపించేవరకు కూడా కమర్ మాతో కలిసి మెలిసి తిరిగాడని.. తమ పిల్లలతో ఆడుకునే వాడని అన్నారు. ఇంతటి దారుణానికి ఒడిగడతాడని అసలు ఊహించలేదని.. బాబును చంపిన నరరూప రాక్షసులకు కఠిన శిక్ష తప్పక పడాలని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఉప్పల్ పోలీసులు కమర్‌పై పోక్సో చట్టం, హత్య, లైంగిక దాడి కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడి కుటుంబానికి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. పరిచయం ఉన్నవారే ఇంతటి దారుణానికి ఒడిగడతారని ఎవరు ఊహించరని.. ఈ ఘటనతో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications