వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లగొండలో దారుణం: సాంబార్ గిన్నెలో పడి చిన్నారి మృతి

మధ్యాహ్నా భోజన సమయంలో క్యూ లైన్ లో నిలుచున్న ఐదేళ్ల జయవర్ధన్‌ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు సాంబార్ గిన్నెలో పడిపోయాడు.

|
Google Oneindia TeluguNews

నల్లగొండ: జిల్లా పరిధిలోని కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామంలో ఉన్న గ్రామీణ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. మధ్యాహ్నా భోజన సమయంలో క్యూ లైన్ లో నిలుచున్న ఐదేళ్ల జయవర్ధన్‌ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు సాంబార్ గిన్నెలో పడిపోయాడు.

ఒళ్లంతా గాయాలు కావడంతో జయవర్దన్ ప్రాథమిక చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఉస్మానియాకు తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం జయవర్దన్ కన్నుమూశాడు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చిన్నారి జయవర్దన్ మరణించాడని పలువురు ఆరోపిస్తున్నారు.

కాగా, పాఠశాలలో ప్రత్యేకంగా వంట గది అంటూ ఏమి లేకపోవడంతో.. ఇరుకైన గదుల్లోనే మధ్యాహ్నా భోజనాన్ని వడ్డిస్తున్నారు. దీంతో క్యూ లైన్లలో నిలుచున్న విద్యార్థులు.. వెనక్కి, ముందుకి ఒకరినొకరు నెట్టేసుకున్నప్పుడు ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి. చిన్నారి జయవర్దన్ మృతికి కూడా ఇదే కారణం.

Five Years Old Boy Died After Falling In Hot Sambar Bowl

మధ్యాహ్నాం భోజనం కోసం క్యూ లైన్ లో ముందు వరుసలో నిలుచున్నాడు జయవర్దన్. ఈ క్రమంలో వెనకనుంచి విద్యార్థులు నెట్టేయడంతో.. ముందున్న సాంబార్ గిన్నెలో పడిపోయాడు. సిబ్బంది నిర్లక్ష్యమో.. విద్యార్థుల క్రమశిక్షణ రాహిత్యమో గానీ మొత్తానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది.

గురుకుల పాఠశాలలో 42మందికి అస్వస్థత..

కొమురం భీమ్ జిల్లా చెలిమెల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 42మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరందరిని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఇందులో ముగ్గురికి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
A five-year-old boy who fell in hot sambar died at the Osmania hospital here today while undergoing treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X