వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు షాక్: వందకోట్లకు అమ్ముడుపోయాడు.. తరిమికొడదామంటూ ఫ్లెక్సీల కలకలం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోజుకో రకంగా మలుపు తిరుగుతుంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగిన నాటి నుండి ఈ కేసు రకరకాలుగా మలుపులు తిరుగుతూనే ఉంది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిజెపికి అమ్ముడు పోకుండా, టిఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి మద్దతు దొరుకుతుంది అని భావిస్తే, అందుకు భిన్నంగా ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తాజాగా అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ కి వ్యతిరేకంగా నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి.

అచ్చంపేట ఆత్మగౌరవాన్ని వందకోట్లకు గువ్వల బాలరాజు అమ్ముకున్నారు: పోస్టర్ ల కలకలం

అచ్చంపేట ఆత్మగౌరవాన్ని వందకోట్లకు గువ్వల బాలరాజు అమ్ముకున్నారు: పోస్టర్ ల కలకలం

అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు ప్రస్తుతం దుమారంగా మారాయి. అచ్చంపేట ఆత్మగౌరవాన్ని వందకోట్లకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అమ్ముకున్నాడని సంచలన ఆరోపణలు చేస్తూ వేసిన పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. వంద కోట్లు తీసుకోవటానికే గువ్వల బాలరాజు అక్కడకు వెళ్ళారు అన్నట్టుగా పోస్టర్ లలో పేర్కొన్నారు.

 గువ్వల బాలరాజును టార్గెట్ చేస్తూ షాకింగ్ పోస్టర్లు

గువ్వల బాలరాజును టార్గెట్ చేస్తూ షాకింగ్ పోస్టర్లు

ఇక ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్లారా, యువకుల్లారా,మేధావులారా, విద్యావంతుల రా ఒకసారి ఆలోచించండి ఎటు పోతుంది మన అచ్చంపేట ఆత్మగౌరవం అంటూ పెట్టిన పోస్ట్ లో.. గువ్వల బాలరాజు ను టార్గెట్ చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో వెలసిన ఈ పోస్టర్లలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజును అచ్చంపేట పొలిమేర దాటే వరకు తరిమికొడదాం.. అచ్చంపేట ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో నియోజకవర్గంలో జరిగిన అనేక సంఘటనలను కూడా ఏకరువు పెట్టి ఎమ్మెల్యే ను టార్గెట్ చేశారు.

 స్థానికంగా జరిగిన ఘటనలను టార్గెట్ చేస్తూ వెలసిన పోస్టర్లు

స్థానికంగా జరిగిన ఘటనలను టార్గెట్ చేస్తూ వెలసిన పోస్టర్లు

గువ్వల బాలరాజు వికలాంగుడైన శ్రీను పై దాడి చేశారని, గిరిజన సర్పంచ్ పై దాడికి పాల్పడ్డారని, ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించిన కార్యకర్తలపై దాడి చేశారని ఇలా అనేక ఘటనలు ప్రస్తావించిన వారు గువ్వల బాలరాజు హయాంలో అచ్చంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని టార్గెట్ చేస్తూ పోస్టర్లు వేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై ఉన్న వ్యతిరేకతను వ్యక్తంచేస్తూ వెలసిన ఈ పోస్టర్లు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ పోస్టు ఎవరు వేశారన్న దానిపైన స్థానికంగా చర్చ జరుగుతుంది.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నేతలు.. ప్రత్యర్ధి పార్టీ నేతలపై అనుమానం

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నేతలు.. ప్రత్యర్ధి పార్టీ నేతలపై అనుమానం


ఇక ఎమ్మెల్యే బాలరాజు పైన స్థానికంగా వెలిసిన పోస్టర్లు ఎమ్మెల్యే కు తలనొప్పిగా తయారయ్యాయి. దీనిపైన టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కావాలని కొందరు ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజార్చిన కోసమే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని, ఇది ప్రత్యర్ధి పార్టీల నాయకులకు నేనంటూ టిఆర్ఎస్ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పై కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు రావడం లేదు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రతను పెంచింది.

English summary
The flexies against MLA Guvvala Balaraju in achhampet constituency. In those flexies slams that guvvala balaraju for being sold for rs.100 crores in TRS MLAs purchase issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X