హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీవీ రిపోర్టర్ మిస్సింగ్ ఘటన విషాదాంతం: కారుతోపాటు జమీరుద్దీన్ మృతదేహం లభ్యం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత రెండ్రోజుల క్రితం కారుతో సహా వరదలో కొట్టుకుపోయిన తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్ జమీరుద్దీన్ ఘటన విషాదాంతమైంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామోజీపేట వాగులో కారుతో గల్లంతైన రిపోర్టర్ జమీర్ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. రామోజీపేట భూపతిపూర్ మధ్యలో శుక్రవారం ఉదయం జమీర్ కారును గుర్తించి బయటకు తీశారు.

అయితే అక్కడి నుంచి కొద్ది దూరంలో చెట్ల కొమ్మలో చిక్కుకున్న జమీర్ మృతదేహాన్ని రెస్క్యూ టీం గుర్తించింది. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం రామెజీపేట- భూపతిపూర్‌ గ్రామాల వాగు భారీ వర్షాలకు పొంగిపొర్లుతుంది.

floods: Missing NTV reporter dead body found in Jagtial district on Friday morning

మూడురోజుల క్రింతం షిప్ట్‌ డిజైర్‌ కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ కారులో న్యూస్‌ కవరేజ్‌కు వెళ్ళిన ఎన్టీవీ రిపోర్టర్‌ జమీర్‌ ఉన్నారు. ఈన్యూస్‌ కవరేజ్‌ చేసేందుకు వెళ్ళిన జమీర్‌, కుటుంబ సభ్యుల నుంచి ఓ వార్త రావడంతో.. వెనుతిరిగాడు జమీర్‌. అయితే ఈ క్రమంలో.. రామోజీపేట వాగు మీదుగా కారులో వస్తుండగా నీటి ప్రవాహం ఎక్కువైంది. వరద ధాటికి జమీర్‌ ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది.

floods: Missing NTV reporter dead body found in Jagtial district on Friday morning

మంగళవారం రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించినా కారు ఆచూకి లభ్యం కాలేదు. అయితే ఎట్టకేలకు జమీర్‌ ఆచూకి లభ్యమైంది. శుక్రవారం ఉదయం కారుతో సహా జమీర్‌ను బయటకు తీశారు. చెట్టు కొమ్మకు జమీర్‌ మృతదేహం కనిపించడంతో.. ప్రాణాలు తెగించి రెస్క్యూటీం జమీర్‌ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. జమీర్‌ మృతితో కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి. జమీర్ మరణం పట్ల పలువురు పాత్రికేయులు సంతాపం తెలిపారు. కాగా, జమీర్ తో పాటు కారులో ప్రయాణించిన స్నేహితుడు లతీఫ్ ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.

English summary
floods: Missing NTV reporter dead body found in Jagtial district on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X