Padi Koushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిపై మండి పడుతున్న ఫ్లైయాష్ కాంట్రాక్టర్లు..

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపణలపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కౌశిక్​ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని ప్లైయాష్​ కాంట్రాక్టర్ల సంఘం తెలిపింది. ప్లైయాష్​ రవాణా ద్వారా 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పడం అవగాహన రహిత్యమన్నారు. శనివారం ప్రెస్ ​క్లబ్ ​లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం నేత సమద్​న ఈ విషయమై మాట్లాడారు.

తనకు కమీషన్ ఇవ్వలేదనే కోపంతోనే పొన్నం ప్రభాకర్ ​పై కౌశిక్​ రెడ్డి ఆరోపణలు చేశారన్నారు. కమీషన్ ఇవ్వనందుకే ప్లైయాష్​ రవాణా చేస్తున్నవారిపై కక్ష పూరితంగా తప్పుడు కేసులు పెడుతున్నట్టు పేర్కొన్నారు. ఎన్టీపీసీలో సింగరేణి నుంచి వచ్చిన బొగ్గు ద్వారా కరెంటు ఉత్పత్తి జరుగుతుందన్నారు. అనంతరం బూడిదగా మారిన బొగ్గు వేల ఎకరాల్లో పేరుకు పోతుందన్నారు. పేరుకు పోయిన ప్లైయాష్​ ను తరలించేందుకు ఎన్టీపీసీ టెండర్లను ఆహ్వానిస్తుందని గుర్తు చేశారు.

Flyash contractors furious over Kaushik Reddy s allegations against Ponnam Prabhakar

గ్రావెల్​ అందుబాటులో లేని ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లకు ఉచితంగా ఈ బూడిదను అందిస్తున్నట్టు వివరించారు.ప్లైయాష్​ రవాణాపై ఆధార పడి మూడు వందల మంది జీవిస్తున్నారని గుర్తు చేశారు. ప్లైయాష్​ కాంట్రాక్ట్​ మొత్తం 150 కోట్లు కాగా.. ఇప్పటి వరకు 30 కోట్ల పనులే జరిగినట్లు తెలిపారు. అలాంటప్పుడు 100కోట్ల కుంభకోణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సమావేశంలో రవీందర్, మల్లేశం, రాజేశ్, ఫరీద్, శ్రీపాల్​తదితరులు పాల్గొన్నారు.

కొద్ది రోజుల క్రితం పాడి కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కౌశిక్ రెడ్డి ఆరోపణలపై గౌడ సంఘం నేతలు కూడా ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+