ఈశ్వర్ సాయి వివాదంపై భార్య శరణ్య షాకింగ్ ట్విస్ట్.. ఆ ఆడియో బయటపెట్టి సంచలనం!
ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ల మధ్య చోటుచేసుకున్న వివాదంపై ఆయన భార్య శరణ్య మరోమారు మీడియాకెక్కారు. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చెప్పి తాను తీవ్ర ఆవేదనలో ఉన్నానని చెప్పారు. భర్తతో తనకు ఉన్న సమస్యలు, మాధురితో జరిగిన సంఘటన, వైరల్ అయిన ఆడియో కాల్, పోలీసుల జోక్యం వంటి అన్ని అంశాలపై ఆమె స్పందించారు.
ఘటన రోజున భర్తను కొట్టానన్న ఈశ్వర్ సాయి భార్య
ఘటన జరిగిన రోజున మొదట మాధురిని కొట్టానని, తర్వాత తన భర్త ఈశ్వర్ సాయిని కూడా కొట్టానని శరణ్య చెప్పారు. అయితే భర్తను కొడుతున్న సన్నివేశం వీడియోలో రికార్డ్ కాలేదని, కోపంలో ఫోన్ కింద పడేయడం వల్ల అది తెలియలేదని వివరించారు. ఆ సమయంలో ఈశ్వర్ సాయి నిశ్శబ్దంగా ఉండటానికి కారణం అతను తప్పు చేసినప్పుడు అలాగే ఉంటాడని, అప్పుడు మద్యం సేవించి ఉన్నాడని ఆమె తెలిపారు.

పోలీసులు తనను కేసు పెట్టొద్దు అని సలహా ఇచ్చారన్న శరణ్య
పోలీసుల ముందు కూడా భర్తను మోసం చేయవద్దని, కుటుంబం బాగుండాలని అడిగానని ఆమె గుర్తుచేశారు. మొదట పోలీసుల వద్దకు వెళ్లకూడదని తాను అనుకున్నానని, కానీ కుటుంబసభ్యుల సలహా మేరకు ఫోన్ చేశామని చెప్పారు. ఆ సమయంలో కెమెరా, పోలీసులు ఉన్నారని భయపెట్టేందుకు కొన్ని అబద్ధాలు చెప్పానని కూడా ఒప్పుకున్నారు. వేములవాడ పోలీస్ స్టేషన్కు వెళ్లినప్పుడు ఒక సీనియర్ అధికారి ఇద్దరి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసు పెట్టవద్దని సలహా ఇచ్చారన్నారు.
కుటుంబ కలహాలతో తనకు దూరంగా ఈశ్వర్ సాయి
అవసరమైతే అండగా ఉంటామని హామీ ఇచ్చారని శరణ్య పేర్కొన్నారు. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కు సంబంధించి వైరల్ అయిన ఆడియో కాల్ గురించి ప్రస్తావిస్తూ, అది భర్త ఇంటికి వచ్చిన తర్వాత జరిగిందని చెప్పారు. కుటుంబ కలహాల కారణంగా ఈశ్వర్ సాయి కొద్దిరోజులు బయట ఉన్న సమయంలోనే మాధురితో ఆ సంభాషణ జరిగిందని ఆమె తెలిపారు.
మాదురితో మళ్ళీ అప్పుడు మాట్లాడిన షాకింగ్ ఆడియో
ఆ ఆడియోలో "నువ్వు పెళ్లి చేసుకోనవసరం లేదు, మనం కలిసి సంపాదించుకుందాం, సమాజాన్ని, శరణ్యను నేను చూసుకుంటాను" అని భర్త అన్నట్లు ఉందని శరణ్య వివరించారు. ఈ ఆడియోను తనకు ఇతరులు పంపించారని, మాధురి తల్లి కూడా "మా అమ్మాయి అంతే" అని అన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత కాల్ లిస్ట్, రికార్డింగ్లు పోలీసుల వద్ద ఉన్నాయని, అవసరమైతే మీడియా ద్వారా బయటకు తీయించవచ్చని అన్నారు.
ఘటన జరిగిన నాటి నుండి తన పరిస్థితి ఇదే అన్న శరణ్య
ఈ వివాదం కారణంగా తాను, తన కొడుకు చాలా ఎఫెక్ట్ అవుతున్నామన్నారు. ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటున్నానని, కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నానని అన్నారు. ఈశ్వర్ సాయి కొడుకుకు క్షమాపణ చెప్పి, మళ్లీ ఇలా చేయనని హామీ ఇచ్చాడని తెలిపారు. ఈ పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని ఈశ్వర్ సాయి భార్య శరణ్య స్పష్టం చేశారు. మరి వీరి వివాదంలో ముందు ముందు ఏం జరగనుందో.














Click it and Unblock the Notifications