ఫోక్ సెలబ్రిటీస్ ఈశ్వర్ సాయి – మాధురీ రాథోడ్ ఎపిసోడ్‌పై నెటిజన్ల జడ్జ్‌మెంట్!
ఫోక్ సెలబ్రిటీలు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ లు వేములవాడలోని రెడ్డి భవన్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈశ్వర్ సాయి భార్య శరణ్య, మరికొందరితో కలిసి అక్కడకు వెళ్లి చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్నిటికంటే ఈశ్వర్ సాయి భార్య శరణ్య మాట్లాడిన బూతులు, ఆ టోటల్ ఎపిసోడ్ ను వీడియో తీసిన అమ్మాయి మాట్లాడిన బూతులు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.
ఈశ్వర్ సాయి భార్య కొట్టినా సైలెంట్ గా ఉన్న మాధురీ రాథోడ్
ఇక ఈశ్వర్ సాయి భార్య కొట్టినా, వీడియో తీసే యువతీ కొట్టు, చంపు అని మాధురి రాథోడ్ ను ఉద్దేశించి మాట్లాడినా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా మాధురి రాథోడ్ అలానే షాక్ లో ఉండిపోయింది. 'బాసింగా బలాలు', 'ప్రమీల' వంటి హిట్ ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు పొందిన ఈ ఇద్దరు ఆర్టిస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ చర్చించుకునే అంశం అయ్యారు.

భార్య శరణ్య తీరును తప్పుబట్టిన నెటిజన్లు
అర్థరాత్రి జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమ జడ్జ్‌మెంట్‌ను స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఈశ్వర్ సాయిని తీవ్రంగా విమర్శిస్తూ, పెళ్లైన వ్యక్తి ఇలా ప్రవర్తించడం తప్పని అన్నారు. భార్య శరణ్య తీరును తప్పుబట్టారు. తన భర్త మంచోడే అని, ఆ అమ్మాయే మీద పడిందని చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. రెండు చేతులూ కలిస్తేనే చప్పుడు అవుతుందని అన్నారు.
వీడియోలు తీసి రచ్చ చేసి పెళ్ళికాని పిల్ల భవిష్యత్ పాడు చేశారంటున్న నెటిజన్లు
భర్తతో మళ్ళీ కలిసి బ్రతకాలి అనుకున్నప్పుడు వీడియోలు తీసి రచ్చ ఎందుకు చేశారో చెప్పాలని నిలదీశారు. మాధురి రాథోడ్ చేసింది తప్పే అయినా, పెళ్లి కాని ఒక ఆడపిల్ల జీవితం వీడియో సోషల్ మీడియాలో పెట్టి నాశనం చేశారని మండిపడ్డారు. ఇంత చేసి ఏం సాధించావ్ అని ఈశ్వర్ సాయి భార్యపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఆ అమ్మాయి బ్రతుకును రోడ్డున పెట్టినందుకు ఆ అమ్మాయిని ఈశ్వర్ సాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని అడుగుతున్న వారు లేకపోలేదు.
వీడియో తీసిన యువతి అత్యుత్సాహంపైన భగ్గుమన్న నెటిజన్లు
ఇదే సమయంలో వీడియో తీసిన యువతి అత్యుత్సాహంపైన కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. తప్పు చేసినా మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి భార్య కొట్టినా ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం ఆమె పట్ల జనాల సానుభూతికి కారణం అయ్యింది. అంతేకాదు ఈశ్వర్ సాయి భార్య, వీడియో తీసిన అమ్మాయి మాట్లాడిన బూతులు వారి తీరుపై ప్రజల అభ్యంతరానికి కారణం అయ్యింది.













Click it and Unblock the Notifications