అల్లు అర్జున్ కోసం... పవన్ కళ్యాణ్ బాటలో స్నేహారెడ్డి షాకింగ్ నిర్ణయం!
సంధ్య థియేటర్ దగ్గర పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడు శ్రీ తేజ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ క్రమంలో అల్లు అర్జున్ పైన కేసు నమోదు అయింది.
అల్లు అర్జున్ కోసం స్నేహారెడ్డి ఆందోళన
ఇటీవల అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడం కోర్టులో హాజరు పరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం, జైలుకు తరలించడం జరిగాయి. ఇక తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ జైలు నుండి బయటకు వచ్చాడు. ఇక అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

41 రోజులపాటు కఠోరదీక్ష చేయనున్న స్నేహారెడ్డి
జైలు నుంచి బయటకు రావడంతో ఇంటికి వచ్చిన తర్వాత భర్తను గట్టిగా హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఇక తాజాగా అల్లు అర్జున్ కోసం తాను ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈ కేసు నుంచి అల్లు అర్జున్ బయటపడాలని బన్నీ సతీమణి స్నేహ రెడ్డి 41 రోజులపాటు కఠోరదీక్ష చేయనున్నారని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ బాటలో స్నేహారెడ్డి
అల్లు అర్జున్ కోసం పవన్ కళ్యాణ్ బాటలో స్నేహ రెడ్డి 41 రోజులపాటు కేవలం పండ్లు తిని ఉపవాసం చేసి, ఆపై తిరుమల శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. గతంలో తిరుమల లడ్డు వివాదం చోటు చేసుకున్న సమయంలో తిరుమల లడ్డు అపవిత్రమైన కారణంగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను నిర్వహించి కేవలం పండ్లు తిని దీక్షను కొనసాగించారు.
ధనుర్మాస పారాయణం చేసి తిరుమలశ్రీవారి ప్రత్యేక పూజ
ఇక ఇదే క్రమంలో తాజాగా పవన్ బాటలో అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి కూడా దీక్ష చేపడుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ధనుర్మాసం సందర్భంగా పారాయణం చేయనున్నారని సమాచారం. ధనుర్మాసం నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళిని ప్రతిరోజు చదివి నియమనిష్ఠలతో పూజించి ఆపై శ్రీవారిని దర్శించుకుంటారని తెలుస్తుంది.
కేసు నుండి అల్లు అర్జున్ గట్టెక్కాలని స్నేహారెడ్డి పూజలు
తిరుమల శ్రీవారు అంటే అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డికి ఎనలేని భక్తి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లు అర్జున్ పైన కేసు నమోదు అయిన సమయంలో కూడా స్నేహ రెడ్డి తిరుమలకు వెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఇప్పుడు కూడా ఈ కేసు వ్యవహారంలో కఠోర దీక్షను ఆచరించి ఆపై తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నట్టు తెలుస్తుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications