తెలంగాణ స్కిల్ వర్సిటీ కోసం ‘మెఘా’ రూ. 200 కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. తెలంగాణ యువతను ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ (MEIL Group)కి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

శనివారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్.. మెఘా కంపెనీ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.

For construction of Telangana Skill University Rs 200 crore allocated Megha

అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మెఘా ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపారు. స్కిల్స్ వర్సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (CSR) నిధుల నుంచి రూ. 200 కోట్లు కేటాయించింది.

ఈ క్యాంపస్‌లో అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్స్ నిర్మిస్తామని పీవీ కృష్ణారెడ్డి తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి.. మెఘా కంపెనీకి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.

హైదరాబాద్ శివారు కందుకూరు మండలంలో మీర్‌ఖాన్‌పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ శ్రేణి Young India Skills University నిర్మాణానికి గత ఆగస్టులోనే ముఖ్యమంత్రి రేవంత్ భూమి పూజ చేశారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను నేటి సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు.

డిజైన్లకు తుది రూపం ఇచ్చి నవంబర్ 8 వ తేదీన యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాగా, తెలంగాణ విద్యార్థులు, యువతకు నైపుణ్యాలు నేర్పించి, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ శివారులోని కందుకూరు వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skills University (ముసాయిదా) నమూనాను విడుదల చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన మార్పులతో తుది డిజైన్ ఖరారుకానుంది. మెఘా ఇంజనీరింగ్ సంస్థ తన సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.200 కోట్లతో వర్సిటీ అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్స్ నిర్మించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి మెఘా సంస్థకు ఒప్పందం కుదిరింది. నవంబర్ 8 నుంచే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+