అమెరికాలో ఇరుక్కుపోయిన విద్యార్థుల‌కు ఆటా అండ‌..! న్యాయ స‌ల‌హా ఇస్తున్న నిపుణులు..!!

మిషిగన్/ హైద‌రాబాద్ : యూఎస్ మిషిగన్ ఫెడరల్ కోర్టులో డిటెన్షన్ లో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థుల విచారణ ప్రారంభమైంది. థియోడోర్ లివిన్ యునైటెడ్ స్టేట్స్ మిషిగన్ ఫెడరల్ కోర్ట్ హౌజ్ లో ఫార్మింగ్టన్ యూనివర్శిటీ విద్యార్థుల విచార‌ణ జరుగుతోంది. 8 మంది తెలుగు విద్యార్థుల తరపున అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆట-తెలంగాణ) అటార్నీని ఏర్పాటు చేసింది.

మొదటి రోజు అటార్నీ ఎడ్వర్డ్ బజూకా వాదనలు వినిపించారు. ట్రయల్ వివరాలు అటార్నీ ఎడ్వర్డ్ బజూకా కు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధి వెంకట్ మంతెన వివరించారు. 8 మంది తెలుగు విద్యార్థుల తరపున వేము వాదిస్తున్నామన్నారు. వీలైనంత తొందరగా విద్యార్థుల విడుదలయ్యేలా ప్రయత్నిస్తున్నాం. విచార‌ణ పూర్తయ్యేంత వరకు తెలుగు విద్యార్థులను ఫెడరల్ కటస్టడీలోనే ఉంచాలని వాదనలు విన్పించామ‌ని తెలిపారు. వారు బెయిల్ పై విడుదలైతే యూఎస్ ఐస్అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు.

For students trapped in America..! Experts giving legal advice .. !!

అదే జరిగితే వారి యూఎస్ ఐస్ వద్ద కస్టడీ శిక్షలో పరిగణించ బడదు. అదే ఫెడరల్ కస్టడీలో ఉంటే రేపు శిక్ష పడ్డాక ఫెడరల్ కస్టడీలో ఉన్న రోజులరు శిక్షకాలం నుంచి మినహాయింపు వస్తుంది...అది ఐస్ అరెస్ట్ చేస్తే సాధ్యపడదన్నారు. అందుకే తెలుగు విద్యార్థులను ఫెడరల్ కస్టడీకి కోరుతున్నామ‌ని, కొంత సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్య‌క్తం చేసారు. ఇక డీ 3( డిఫెండెంట్) గా ఉన్న విద్యార్థి ఫణీంధ్ర కర్ణాటికి బోయిల్ వచ్చింది.

కానీ అతన్ని ఐస్ అదుపులోకి తీసుకోలేదు. ఎందుకుంటే అతను హెచ్1 వీసా కలిగి ఉన్నాడు. ప్రభుత్వం విద్యార్థుల అరెస్టు సమయంలో సీజ్ చేసిన సమయంలో చాలా ఫైల్స్, ఫోన్ కాల్ లిస్ట్, డేటా సేకరించింది. ఆ డేటాను పరిశీలించేందుకు చాలా సమయం పడుతుందని, విచారణలో చాలా కాన్ఫిడెన్షియల్ విషయాలు ఉన్నాయని, వాటిని బ‌హిర్గ‌తం చేయ‌లేమ‌ని, త‌దుప‌రి విచార‌ణ ఎప్పుడు ఉండేది కూడా న్యాయమూర్తి నిర్ణయం మేరకే ఉంటుంది అని వెంకట్ మంతెన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+