శబరిమల అయ్యప్ప భక్తుల కోసం.. వాటిపై నిషేధం!

శబరిమల అయ్యప్ప దేవస్థానానికి అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు. వారి సౌకర్యం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడా అయ్యప్ప భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లను చేస్తుంది. అయితే ఇటీవల శబరిమలలో డోలి కార్మికులు ఆందోళన చేశారు. ఇక డోలీ కార్మికుల ఆందోళనల నేపథ్యంలో హైకోర్టు తాజాగా కీలక ఉత్తర్వులను జారీ చేసింది.

శబరిమలలో డోలీ కార్మికుల సమ్మె
శబరిమలలో ధర్నాలు, ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు వెల్లడించింది. శబరిమల ఆధ్యాత్మిక ప్రదేశం అని, అక్కడ ధర్నాలు, నిరసనలకు అనుమతించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. శబరిమల లో తాము చేసే సేవలకు ముందుగానే రుసుము చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు చేసిన ఆలోచనకు వ్యతిరేకంగా డోలి కార్మికులు సమ్మె చేపట్టారు.

For the sake of Sabarimala Ayyappa devotees kerala high court key orders ban on protests

పంపానది వద్ద డోలీ సేవలు నిలిపివేసి ఆందోళన
అయితే డోలీ సేవలకు తమతో సంప్రదింపులు జరపకుండానే ట్రావెన్కోర్ బోర్డు నిర్ణయం తీసుకోవడంతో డోలి కార్మికులు సమ్మెకు దిగారు. పంపా నది వద్ద సమ్మె నిర్వహించిన డోలి కార్మికులు డోలీ సేవలు నిలిపివేయడంతో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ డిమాండ్లని అడగకుండానే దేవస్వం బోర్డు నిర్ణయం తీసుకోవటాన్ని వారు తప్పు పట్టారు.

జిల్లా మెజిస్ట్రేట్ తో చర్చల తర్వాత సమ్మె విరమింపు
ఇక జిల్లా కలెక్టర్ డోలి కార్మికులతో మాట్లాడి వారి డిమాండ్లను రాతపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాదు సంబంధిత దేవస్వం బోర్డు అధికారుల ఎదుట వారి డిమాండ్లను తెలిపేందుకు అవకాశం కల్పిస్తామని కూడా కార్మికులకు హామీ ఇచ్చారు. జిల్లా మెజిస్ట్రేట్ తో చర్చించిన తర్వాత డోలి కార్మికులు నిరసన విరమించారు.

సమ్మెలపై కేరళ హైకోర్టు కీలక ఉత్తర్వులు
ఇక ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాలతో డోలి సేవలను ప్రీపెయిడ్ విధానంలో ప్రారంభించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు పంపా, నీలిమల వద్ద మూడు కౌంటర్లను ఏర్పాటు చేసి, ఈ కౌంటర్ల ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని ఆపై డోలి కార్మికులకు అందజేస్తారు. మొత్తానికి డోలి కార్మికుల నిరసన నేపథ్యంలో శబరిమలలో ధర్నాలు, నిరసనల పైన నిషేధం విధిస్తూ కేరళ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+