ఇదీ రేవంత్ కేసు: కేంద్రానికి టీ సర్కార్, నోటీసుల లిస్ట్‌లో చంద్రబాబు, ఎమ్మెల్యే!

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నోటీసుల జాబితాలో చంద్రబాబు పేరు ఉందని తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్ రెడ్డిలను ప్రశ్నించే అవకాశముందని చెబుతున్నారు.

ముడుపుల కేసుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు సమగ్ర నివేదిక అందజేసింది. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ముడుపులు ఇస్తూ దొరికిపోయిన కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, సేకరించిన ఆధారాలు, ఇతర వ్యక్తుల ప్రమేయం, తీసుకున్న చర్యలు, ఇకపై తీసుకోబోయే చర్యలు ఇలా ప్రతి అంశం సమగ్రంగా వివరిస్తూ కేంద్ర హోం శాఖకు నివేదిక పంపినట్లు తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్‌ చేసిందంటూ చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ అఫ్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా ముడుపుల కేసుపై దీనిపై నివేదిక పంపింది.

ప్రధానితో చంద్రబాబు భేటీకి ముందే జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తెలంగాణ ఏసీబీ చీఫ్‌ ఏకే ఖాన్‌ నుంచి సమాచారం సేకరించారని తెలుస్తోంది. కేసులో చంద్రబాబు ప్రమేయం పై వివరాలు తెలుసుకున్నారని సమాచారం.

revanth reddy

ఏసీబీ అధికారులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, కాల్‌ డేటాతో సేకరించిన సమాచారం ఆధారంగా తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.

ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్‌ ఫోన్‌ నుంచి ఎక్కువసార్లు సండ్రకు కాల్స్‌ వెళ్లినట్లు ఏసీబీ గుర్తించిందని తెలుస్తోంది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం వల్ల అంతిమంగా లబ్ధి చేకూరేది వేం నరేందర్‌ రెడ్డి కావడంతో ఈ విషయం మొత్తం ఆయనకు తెలిసే ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

అందుకే, వీరిద్దరినీ ప్రశ్నించాలని భావిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలకు తగిన బలం ఏర్పడ్డాక మరికొంత మందికి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏసీబీ నోటీసులు అందుకునే వారిలో చంద్రబాబు, ఆయనకు సన్నిహితంగా ఉండే కేంద్ర, ఏపీ రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.

రేవంత్‌ కాల్‌ డేటాలో వందల సంఖ్యలో ఇన్‌కమింగ్‌, అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ ఉన్నప్పటికీ సహ నిందితులతోపాటు ఇతర రాజకీయ ప్రముఖులతో ఆయన ఎక్కువసార్లు సంభాషణలు సాగించినట్లు గుర్తించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు, కొందరు వ్యాపార ప్రముఖులు ఉన్నారని సమాచారం.

రేవంత్, సహ నిందితుల్ని అరెస్ట్‌ చేసిన సమయంలో రికార్డు చేసిన ఆడియో, వీడియో టేపులు, ఐ ఫోన్లు, సోదాల్లో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌ను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ లేబేరేటరీకి తరలించిన విషయం తెలిసిందే. ఈ టేపుల్ని మూడు దశల్లో పరీక్షించాల్సి ఉన్నందున నిపుణులు నిజాలు నిగ్గుతేల్చే పని మొదలు పెట్టారు. ఈ కేసులో ఫిర్యాదుదారు, ప్రధాన సాక్షిగా ఉన్న నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ వాంగ్మూలం ఇవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+