అసలైన బాహుబలి ఇతనే అంటూ కేటీఆర్ ట్వీట్: ఏనుగును ఎత్తుకొని

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. అసలైన బాహుబలి అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఫోటోను కూడా పెట్టారు.

ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఓ ఏనుగు పిల్లను జాగ్రత్తగా తీసుకు వెళ్తున్నాడు. ఈ ఒక్క ఫొటోతో అతను హీరో అయ్యాడు. ఇతని పేరు శరత్ కుమార్‌. తమిళనాడులో ఫారెస్ట్‌ గార్డుగా పని చేస్తున్నాడు.

ఇటీవల అతను గార్డుగా పని చేస్తున్న అడవిలో ఓ ఏనుగు పిల్ల గుంతలో పడిపోయింది. దాంతో ఆ పిల్ల తల్లి అడవి సమీపంలో ఉన్న రోడ్డు పైకి వచ్చి వాహనాలను ఆపేసింది. కొందరు వ్యక్తులు దాన్ని అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించారు.

ఆ సమయంలో అది గుంతలో పడింది. వెంటనే ఈ విషయాన్ని ఫారెస్ట్ గార్డుకు సమాచారం ఇచ్చారు. శరత్ కుమార్‌ ఏనుగు పిల్లను కాపాడేందుకు వెళ్లాడు.

తిండి లేక నీరసించిపోయిన ఆ పిల్లను భుజాలపై మోసుకుని దగ్గరలోని ఆసుపత్రికి తరలించాడు. అతను పిల్లని ఎత్తుకుని తీసుకెళుతున్న ఫొటో సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్‌గా మారింది. అందరూ తన కంటే బరువుగా ఉన్న ఏనుగు పిల్లను ఎలా మోసుకెళ్లావని ప్రశ్నిస్తున్నారని అతను తెలిపాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A forest guard has quickly become a hero for animal lovers after he saved the life of a baby elephant which had fallen in a ditch.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X