వలసలతో కుదేల్: బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై
Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది. అధికారాన్ని కోల్పోయాక పలువురు సీనియర్లు బీఆర్ఎస్‌ను వీడారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం దీనికి మినహాయింపు కాదు.
ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడారు. బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు కూతురు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కేశవరావు కూడా కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను ఆయన ధృవీకరించారు కూడా.

బీఆర్ఎస్‌కే చెందిన మరో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం, కూతురు కడియం కావ్యతో సహా కాంగ్రెస్‌లో చేరారు. వరంగల్ లోక్‌సభ టికెట్‌ను కేటాయించిన తరువాత కూడా ఆమె దాన్ని వదులుకుని మరీ పార్టీని వీడారు. అదే వరంగల్ లోక్‌సభలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు.
తాజాగా- బీఆర్ఎస్‌కు మరో మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.

బీఆర్ఎస్ అభ్యర్థిగా బోధ్ నియోజకవర్గం నుంచి బాపూ రావు వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. 2023 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. అనిల్ జాదవ్‌కు టికెట ఇచ్చింది బీఆర్ఎస్. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. తన స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకుంది.
ఈ ఎన్నికల తరువాత బాపూ రావు పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఎలాంటి క్రియాశీలక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదు. తాజాగా పార్టీని వీడారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications