హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాత కేసును తవ్వి తీస్తోన్న ఈడీ - విచారణకు సికింద్రాబాద్ మాజీ ఎంపీ..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్‌ కేసు మళ్లీ తెర మీదికి వచ్చింది. నేషనల్ హెరాల్డ్‌లో మనీలాండరింగ్ చోటు చేసుకుందని అనుమానిస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దీనిపై దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఇదివరకే ఈ కేసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె.. తదితరులు విచారణను ఎదుర్కొన్నారు.

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ మూడో రోజు విచారణ ముగిసింది. కొద్దిసేపటి కిందటే ఆమె దేశ రాజధానిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి తన 10, జన్‌పథ్ నివాసానికి చేరుకున్నారు. ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరు కావడం వరుసగా ఇది మూడో సారి. ఈడీ అధికారులు మరోసారి ఆమెకు ఎలాంటి సమన్లను కూడా జారీ చేయలేదని తెలుస్తోంది. సమన్లను జారీ చేయకపోవడం వల్ల- విచారణ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Former Congress MP Anjan Kumar Yadav to face ED inquiry in National Herald case.

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈడీ విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. జూన్‌లో వరుసగా మూడు రోజుల పాటు ఆమె దేశ రాజధానిలో ఈడీ కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరయ్యారు. వాటన్నింటికీ ఆమె సంతృప్తికరమైన వివరణలు ఇచ్చారని అప్పట్లో ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ మూడు రోజుల్లో 70కి పైగా ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించారని, వాటన్నింటికీ ఆమె సరైన సమాధానం ఇచ్చారని స్పష్టం చేశాయి.

ఇదే కేసులోనే ఇదివరకు సోనియా గాంధీ కుమారుడు, వాయనాడ్ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనను కూడా మూడు రోజుల పాటు అధికారులు విచారించారు. ఆ తరువాత తుదపరి చర్యలకు దిగలేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అధికారులు ఆ తరువాత ఎలాంటి సమన్లు జారీ చేయలేదు. దీనితో మరోమారు విచారణ ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఈడీ అధికారులు కూడా వారిని విచారణకు పిలిపించలేదు.

తాజాగా ఇదే నేషనల్ హెరాల్డ్ కేసులో సికింద్రాబాద్‌కు చెందిన కాంగ్రెస్ లోక్‌సభ మాజీ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ హాజరు కానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయనను విచారణకు పిలిచారు ఈడీ అధికారులు. ఇదివరకు అంజన్‌కుమార్ యాదవ్ యంగ్ ఇండియాకు 20 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించారు. ఈ మొత్తం ఎక్కడిదనే విషయంపై అధికారులు ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.

English summary
Former Congress MP Anjan Kumar Yadav to face ED inquiry in National Herald case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X