Harish Rao: ప్రజా సమస్యలపై గొంతెత్తున్న ట్రబుల్ షూటర్..
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్య వచ్చినా స్పందిస్తున్నారు. ప్రజలకు అండగా నిలుస్తున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా రుణ మాఫీపై ప్రభుత్వాన్ని నిలదీశారు. పింఛన్ రూ.4వేలు ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతీ హామీపై హరీశ్ రావు మాట్లాడుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
గ్రూప్-1 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పాస్ అయిన విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ అవకాశం కల్పించాలన్నారు. ఆరు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తాజాగా ఇంటర్ విద్యార్థుల సమస్యలపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఇంటర్ తరగతులు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పేద విద్యార్థులు చదువుతున్నారని.. వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.

"రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం. ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. 422 జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది పేద, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైంది" అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
రాష్ట్రంలోని కొన్ని జూనియర్ కాలేజీల్లో మొదటి ఏడాది జీరో అడ్మిషన్స్ నమోదవడం పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు, జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వర్తించే 1654 గెస్ట్ ఫ్యాకల్టీ రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై
— Harish Rao Thanneeru (@BRSHarish) June 19, 2024
19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం.
ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
422 జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది…
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో మరో రెండు పీజీ కోర్స్ లు, మిట్టపల్లి వద్ద ఉన్న మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లో ఒక పీజీ కోర్సు ప్రారంభమైనట్లు హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట డిగ్రీ కాలేజ్ లో ఇప్పటికే 10 పీజీ కోర్సులతో తరగతులు నడుస్తున్నాయని గుర్తు చేశారు.
కొత్తగా ఎమ్మెస్సీ మైక్రో బయాలాజీ, ఎమ్మెస్సీ కంప్యూటర్స్ 60 సీట్ల చొప్పున ఈ ఏడాది నుంచి ప్రారంభం అయ్యాయని వివరించారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications