Mallareddy: మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఎన్నికల్లో పోటీ చేయడంటా..!
మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిశారు. ఇందుకు సంబంధించి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని అందరు భావించారు. అయితే దీనిపై మల్లారెడ్డి స్పందించారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటున్నట్లు తేల్చి చెప్పారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో డీకే శివకుమార్ ను కలిసినట్లు చెప్పారు.
ఇందులో ఎలాంటి రాజకీయం లేదని తెలిపారు. బీఆర్ఎస్ లోనే ఉంటూ.. వచ్చే ఐదేళ్లు ప్రజా సేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. అధిష్ఠానం అవకాశమిస్తే మల్కాజిరిగి లోక్‌సభ స్థానం నుంచి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని ఇటీవల మల్లారెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తన కుటుంబం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయడం లేదని చెప్పారు.

తాజాగా ఏకంగా రాజకీయాలు వైదొలుగుతానని చెప్పడం స్థానికంగా చర్చనీయంశంగా మారింది. మల్లారెడ్డి, ఆయన అల్లుడికి సంబంధించిన కాలేజీలను కొన్నింటిని చెరువులు కబ్జా చేసి కట్టినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వాటిని కూల్చివేశారు. గతంలో కూడా మల్లారెడ్డిపై అనేక భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఆయనపై ఎవరూ కూడా ఫిర్యాదు చేయడానికి సహాసించలేదు.
తాజాగా బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో మల్లారెడ్డి పై ఫిర్యాదులు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అధికార పార్టీలో చేరితే ఈ సమస్యలు తప్పుతాయని భావించినట్లు వార్తలు వచ్చాయి. అందుకే కాంగ్రెస్ చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు.. రేవంత్ రెడ్డి మల్లారెడ్డి రాకను వ్యతిరేకించినట్లు కొందరు చెబుతున్నారు. అందుకే మల్లారెడ్డి డీకే శివకుమార్ కలిసినట్లు వివరిస్తున్నారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రానట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రేవంత్, మల్లారెడ్డి టీడీలో ఉన్నప్పుడు ఓ పార్టీకి వెళ్లారు. అక్కడ మల్లారెడ్డి రేవంత్ ను ఉద్దేశిస్తూ.. నువ్వు సీఎం అయితవు అన్న అని అన్నాడు.












Click it and Unblock the Notifications