Jupally Krishnarao: బీఆర్ఎస్ ఓటమే నా లక్ష్యం: జూపల్లి కృష్ణారావు
బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం ఆ పార్టీ పై విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో జూపల్లి తన అనుచరులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. తన ఆట ఇప్పుడే మొదలయిందన్నారు. తెలంగాణ మైదానమని.. గోల్ కొడితే ప్రగతి భవన్ లో పడుతుందన్నారు. త్వరలో మహబూబ్ నగర్ లోని ప్రతి నియోజకవర్గాకి వస్తానని.. 14 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ లూఠీ చేసిన ప్రజా ధనాన్ని హుజురాబాద్ లో పంచినట్లు తనను ఓడించడానికి కొల్లాపూర్ లో అందరికి దళితబంధు, ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి పోరాడామని.. రాష్ట్రం వచ్చాక మళ్లీ పోరాడాల్సిన రావడం బాధకమన్నారు. త్వరలో ఆధారాలతో సహా అందరి బండారం బయట పెడతానని జూపల్లి హెచ్చరించారు. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

ఆ తర్వాత జూపల్లి కృష్ణారావు రెండ్రోజుల క్రితం పొంగులేటిని కలవడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ అధిష్టానం ఈ ఇద్దరు నేతలుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీవైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, జూపల్లి కృష్ణారావును తమ పార్టీలో చేర్చుకునేందుకు ఇప్పటికే బీజేపీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ తమ పార్టీలో చేరాలంటూ జూపల్లిని కోరారు.












Click it and Unblock the Notifications