Konda Surekha: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాజీ మంత్రి కొండా సురేఖ ..
మాజీ మంత్రి కొండా సురేఖ ప్రమాదానికి గురయ్యారు. రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో సురేఖ నడుపుతున్న స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో కొండా సురేఖకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం తప్పడం కాంగ్రెస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
భూపాలపల్లిలో రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అందులో పాల్గొన్న సురేఖ స్వయంగా బైక్ నడిపారు. వందల బైకులు ఉండటంతో అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో ఆమె ముఖం, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొండా సురేఖ పరకాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రకటించిన మొదటి జాబితాలో ఆమె పేరు రాలేదు. రెండో జాబితాలో ఆమె పేరు వచ్చే అవకాశం ఉంది. ఈలోగానే ఆమె గాయపడడంతో ఆమె అనుచరులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications