న్యూఇయర్ 2018: క్లబ్‌లో డ్యాన్స్‌తో అదరగొట్టిన మాజీ ఎంపీ రాజయ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్: 2018 న్యూ ఇయర్ వేడుకల సంబరాలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోను చాలామంది ఈ ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.

న్యూఇయర్: కార్లన్నీ ఖరీదైనవే, పోలీసులను వేడుకున్న యాంకర్ ప్రదీప్, ఏం జరిగిందంటే?

యువత అర్ధరాత్రి వరకు కేరింతలు కొట్టింది. అర్ధరాత్రి పన్నెండు కాగానే ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కొత్త ఏడాది వేడుకల జోష్‌లో సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

 కిరాక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్న రాజయ్య

కిరాక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్న రాజయ్య

వరంగల్ జిల్లాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య వరంగల్ క్లబ్ న్యూఇయర్ పార్టీలో డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన చేసిన కిరాక్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

 సన్నిహితులతో కలిసి సరదాగా డ్యాన్స్

సన్నిహితులతో కలిసి సరదాగా డ్యాన్స్

వరంగల్ క్లబ్‌లో న్యూఇయర్ వేడుకలు నిర్వహించారు. ఇక్కడకు రాజయ్య తన సన్నిహితులతో కలిసి వచ్చారు. అందరితో పాటు అతను కూడా డ్యాన్స్ చేశారు. పాటకు తగినట్లు స్టెప్పులు వేస్తూ, హావభావాలు మార్చుతూ కాలు కదిపారు.

 సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే

సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కాసేపటికే వైరల్ అయ్యాయి. కాగా, కోడలు ఆత్మహత్య కేసులో అతను కొన్నాళ్లపాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ పైన విడుదలయ్యారు. చాన్నాళ్లకు న్యూ ఇయర్ పార్టీలో ఎంజాయ్ చేశారు.

 ఆనందోత్సాహం

ఆనందోత్సాహం

కాగా, కొత్త ఏడాది సంబరాలతో పండుగ వాతావరణం నెలకొంది. హోరెత్తించే సంగీతం, హుషారెత్తించేలా నృత్యాలు యువత కేరింతలతో మార్మోగింది. బైక్‌లపై దూసుకెళుతూ, కార్లలో షికార్లు చేస్తూ శుభాకాంక్షలు చెప్పుకొంటూ సందడి చేశారు. పబ్‌లు, క్లబ్స్‌, హోటల్స్‌, వేడుకలు జరిగే ప్రదేశాలను లైట్లతో వెలుగులు విరజిమ్మాయి. అర్ధరాత్రి రోడ్లపైకి చేరిన యువతీ యువకులు రోడ్లను వేదికలుగా మలచుకున్నారు. కేకులు కోస్తూ సంతోషంతో కేకలు వేస్తూ సంబరాలు చేసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former MP Sircilla Rajaiah dance in New Year 2018 eve on Sunday night in Warngal clup.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి