తొలగింపు నిర్ణయం పై హైకోర్టును ఆశ్రయించనున్న మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించి సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది . ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంతో మొదలైన రగడ ఇంకా కొనసాగుతుంది. ఇక ఆ నిర్ణయ పరిణామాలు చివరకు ఎన్నికల కమీషనర్ ను తొలగించి ఆర్డినెన్స్ తీసుకొచ్చే దాకా వెళ్ళాయి అంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు . ఇక ఈ నేపధ్యంలోనే ఆయన స్థానంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజును ప్రభుత్వం నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. తన పదవీకాల పరిమితి కుదింపు, తొలగింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఇవాళ, రేపు హైకోర్టుకు సెలవులు కావడంతో నిమ్మగడ్డ హౌస్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. అయితే ఈ తొలగింపు నిర్ణయం విషయంలో అలాగే కొత్త ఎన్నికల కమీషనర్ నియామకంపై కూడా హైకోర్టు విచారించి ఏం తీర్పునివ్వనుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలోనే కాదు అధికార వర్గాలలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఇక ఏపీలో తాజా రాజకీయ పరిణామాలలో భాగంగా ఏపీ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రకారం ఎస్‌ఈసీగా కనగరాజు నియమితులయ్యారు. ఇక ఈయన మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 9ఏళ్ల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. అంతేకాకుండా వివిధ కమిషన్లలో కూడా సభ్యుడిగా కనగరాజు వ్యవహరించారు. ఇక ఇప్పుడు కనగారాజు నియామక వ్యవహారం కూడా కోర్టుకు చేరటంతో ఈ విషయంలో ఏం జరుగుతుంది .ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్దిస్తుందా? లేకా తప్పు పడుతుందా ? మాజీ ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ పరిస్థితి ఏమవుతుంది అన్నది ఉత్కంఠగా మారింది .












Click it and Unblock the Notifications