మావి ఏవి: నేతల అలక, పేర్లు చెప్పిన రేవంత్, టీడీపీలో మరో వికెట్ డౌన్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/హైదరాబాద్: రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన వారి పేర్లను కాంగ్రెస్ పెద్దలు ఏఐసీసీ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇందులో కొందరి పేర్లను వారు పేర్కొనలేదు.

అందుకే టీడీపీని వదిలేశా: మోడీని లాగిన రేవంత్, సోనియాను ఆకాశానికెత్తారు

 కొందరి అలక, పేర్లు చెప్పిన రేవంత్ రెడ్డి

కొందరి అలక, పేర్లు చెప్పిన రేవంత్ రెడ్డి

దీంతో తమ పేర్లు చదవలేదని టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతమంది నేతలు అలకవహించారు. దీంతో రేవంత్ ఆ తర్వాత మీడియా సమావేశంలో వారి పేర్లు వెల్లడించారు. ఆయన మిగతా వారి అందరి పేర్లను తెలిపారు. దీంతో వారు అలకవీడారు.

 కేసీఆర్ వాటిని పక్కన పెట్టారు

కేసీఆర్ వాటిని పక్కన పెట్టారు

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఓ కార్యకర్తగా చేరారని తెలిపారు. పార్టీలో ఎంతోమంది మహామహులు ఉన్నారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న వారంతా గొర్రెలు, బర్రెలు, చీరల కోసం అమరులు కాలేదని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేశారన్నారు.

నా వెంట వీరు.. రేవంత్

నా వెంట వీరు.. రేవంత్

మాజీ మంత్రి బోడ జనార్ధన్‌, మాజీ ఎమ్మెల్యేలు విజయరమణారావు, వేం నరేందర్‌ రెడ్డి, కె గంగాధర్‌, సీతక్క సోయం బాపూరావు, గంగాధర్ గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ అరికల నర్సారెడ్డి, గండు సావిత్రమ్మ, టీడీపీ అధికార ప్రతినిధి సతీశ్‌ మాదిగ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, హరిప్రియ నాయక్‌, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, తోటకూర జంగయ్య యాదవ్‌, బిల్యా నాయక్‌, రాజారాం యాదవ్‌, పటేల్‌ రమేశ్ రెడ్డి, తోటకూర రవిశంకర్‌, దొమ్మాటి సాంబయ్య, మన్నె సతీశ్‌, మేడిపల్లి సత్యం, కె భూపాల్‌రెడ్డి, రావి శ్రీనివాస రావు, భట్టి జగపతి, కశ్యప్‌ రెడ్డి, మద్దెల రవీందర్‌, సుభాష్ రెడ్డి, శశికళా రెడ్డి, చుక్కాల ఉదయ్ చందర్‌, డగిల శ్రీకాంత్ గౌడ్‌, చారకొండ వెంకటేశ్‌, పొట్టి ఎల్లయ్య యాదవ్‌, కొప్పుల నరిసింహా రెడ్డి, రఘుకిరణ్‌, సాతు మల్లయ్య, హరిసింగ్ నాయక్‌, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర రావు, జ్ఞానేశ్వర్‌, దొమ్మాటి సాంబయ్య, శివరాజ్ పాటిల్‌, సిహెచ్‌ సత్యనారాయణ రెడ్డి, మారెపల్లి సురేందర్ రెడ్డి, మంగి జైపాల్‌ రెడ్డి, ఆర్‌ఎస్‌ ఉదయసింహా, ఆలపాటి విజయ్ బాబులు, విద్యార్థి నాయకులు దరువు ఎల్లన్న, బాలలక్ష్మి, దుర్గం భాస్కర్‌.

 మరో వికెట్.. మహబూబాబాద్ అధ్యక్ష పదవికి రాజీనామా

మరో వికెట్.. మహబూబాబాద్ అధ్యక్ష పదవికి రాజీనామా

టీడీపీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి చుక్కల ఉదయ్ చందర్ రాజీనామా చేశారు. వేం నరేందర్ రెడ్డి అనుచరుడిగా ఉన్న ఉదయ్ చందర్ ఆయన బాటలోనే నడుస్తూ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు పంపించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Revanth Reddy, who quit Telugu Desam Party (TDP) recently, joined Congress on Tuesday in the presence of party vice president Rahul Gandhi in Delhi, ANI reported. Revanth Reddy was working president of Telangana state unit of Telugu Desam Party. He resigned from the primary membership of the party as well as all other party posts on October 28.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి