హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నేరచరితుల జాబితా ఇదే: ఎవరిపై ఎన్నెన్ని..?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వివిధ పార్టీల తరుపున పోటీ పడుతున్న అభ్యర్ధుల నేరచరిత్ర జాబితాను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గురువారం నాడు విడుదల చేసింది. 72 మందితో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ జాబితాను విడుదల చేసింది. 51 డివిజన్లలో పోటీ చేస్తున్న 72 మందిపై పోలీసుస్టేషన్లు, కోర్టు విచారణల్లో కేసులున్నాయని ఈ సంస్థ వెల్లడించింది.

అందులో అధికార టిఆర్ఎస్ పార్టీలోనే ఎక్కువ మంది నేర చరితులు ఉన్నారు. 72 మందిలో 64 మంది పురుషులు, 8 మంది మహిళలు నేర చరిత్రను కలిగి ఉన్నారు. పార్టీల పరంగా చూస్తే టిఆర్ఎస్ - 14, టిడిపి - 13, కాంగ్రెస్ - 13, మజ్లిస్ - 11, బిజెపి - 4, ఎంబీటీలో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు, బీఎస్పీ ఒకరు, ఎస్పీ ఒకరు, స్వతంత్రుల్లో 11 మంది అభ్యర్థులు నేర చరిత్రను కలిగి ఉన్నారు.

Click here to Know more about GHMC elections 2016

అత్యధికంగా శాలిబండ డివిజన్ నుంచి బీజేపీ, ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్న పొన్నా వెంకట రమణ, మహ్మద్ ముస్తఫా అలీలపై ఆరేసి చొప్పున కేసులు నమోదై ఉన్నాయి. టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా బీఎన్ రెడ్డి నగర్ నుంచి రంగంలోకి దిగిన నర్సింహ్మరావుపై ఐదు కేసులు ఉన్నాయి.

ఈ ఐదింటిలో అత్యధికం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భాల్లో నమోదైనవే. కాంగ్రెస్ పార్టీ తరుపున మేయర్ అభ్యర్ధిగా ప్రకటించిన ముల్లా విక్రమ్ గౌడ్‌పై ఓ కేసు నమోదైంది. మెహదీపట్నం నుంచి ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్న మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్‌పై హుమాయున్‌నగర్ ఠాణాలో రెండు కేసులున్నాయి.

Forum for Good Governance releases Candidates with Criminal records

వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధుల నేర చరిత్ర వివరాలిలా ఉన్నాయి:

* 3 చర్లపల్లి మహేశ్ కాంగ్రెస్ సీఆర్ నంబర్ 779/2014 సీఆర్‌నంబర్ 689/2014 యూ/ఎస్324 ఆఫ్ ఐపీసీ 506
* 3 చర్లపల్లి బి.రామ్మోహన్ టీఆర్‌ఎస్ సీసీనంబర్ 1401/2009, 621/2011, 819/2011 5 మల్లాపూర్ పి.ప్రతాప్ రెడ్డి టీడీపీ ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసు
* 14 బీఎన్‌రెడ్డి నగర్ ఎం.సుమన్‌గౌడ్ కాంగ్రెస్ సీసీనంబర్ 370/2013
* 14 బీఎన్‌రెడ్డి నగర్ నర్సింహారావు టీఆర్‌ఎస్ ఐదు కేసులు
* 15 వనస్థలిపురం ఎస్.ప్రభాకర్ రెడ్డి టీడీపీ కోర్టులో రెండు కేసులు
* 17 చంపాపేట్ ఎస్.రమణారెడ్డి టీఆర్‌ఎస్ ఎస్‌సీ నంబర్ 318/2014 యూ/ఎస్302201 ఆర్/డబ్ల్యూ 120-బీ ఆఫ్ సీఆర్‌పీసీ
* 18 లింగోజిగూడ జానీమియా టీడీపీ యూ/ఎస్ 141, 341, 353, 290 ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ
* 21 కొత్తపేట్ బి.మహేందర్‌గౌడ్ టీడీపీ కోర్టులో కేసు ఉంది
* 27 అక్బర్‌బాగ్ సయ్యద్ మిన్హజుద్దీన్ ఎంఐఎం కోర్టులో రెండు కేసులు
* 29 చావ్నీ మహమ్మద్ ముర్తుజా ఆలీ ఎంఐఎం కోర్టులో రెండు కేసులు, ఐపీసీ 447, 427, 434,188
* 30 దబీర్‌పుర మీర్జా రియాజ్ ఉల్‌హసేన్ ఎంఐఎం కోర్టులో రెండు కేసులు
* 32 పతర్‌గట్టి మూసా ఖాసీమ్ కాంగ్రెస్ యూ/ఎస్ 324 సీసీ నంబర్.325/2011
* 32 పతర్‌గట్టి మహమ్మద్ హస్మత్ ఆలీ సీపీఐ సీసీనంబర్ 21/12 హుసేనీ ఆలమ్ పోలీసు స్టేషన్
* 35 గౌలిపుర కె.మీనా టీఆర్‌ఎస్ సీసీనంబర్ 451 యూ/ఎస్ 420,468,409,471 ఆర్/డబ్ల్యూ 120-బీ ఐపీసీ
* 40 రియాసత్ నగర్ ఎంఏ హబీబ్ ఎంబీటీ కేసునంబర్: 1866/2009
* 40 రియాసత్ నగర్ మీర్జా ముస్తాఫా బేగ్ ఎంఐఎం ఐపీసీ 143, 323, 34 కోర్టు విచారణలో ఉంది

* 43 చాంద్రాయణగుట్ట మహమ్మద్ సత్తార్ ఎంబీటీ సీసీ నంబర్ 747/15
* 43 చాంద్రాయణగుట్ట మహమ్మద్ జబ్బర్ ఇండిపెండెంట్ సీసీ నంబర్ 747/15
* 45 జంగమ్మెట్ అవాద్ అఫారీ కాంగ్రెస్ సీసీ నంబర్ 843/09 యూ/ఎస్ 147, 148, 234, 427, 806, 149 ఆఫ్ ఐపీసీ
* 46 ఫలక్‌నుమా కె.తారాబాయ్ ఎంఐఎం సీసీ నంబర్ 395/2014 యూ/ఎస్ 324, 506, 354 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ
* 46 ఫలక్‌నుమా జి.రవీంద్రనాయక్ ఇండిపెండెంట్ (1)సీసీనంబర్ 395/14 యూ/ఎస్ 324, 506, 354 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ
* 48 శాలిబండ పొన్న వెంకటరమణ బీజేపీ కోర్టులో ఆరు కేసులు
* 48 శాలిబండ మహమ్మద్ ముస్తాఫ్‌ఆలీ ఎంఐఎం కోర్టులో ఆరు కేసులు
* 50 బేగంబజార్ జి.శంకర్ యాదవ్ ఇండిపెండెంట్ సీసీనంబర్ 4/2003యూ/ఎస్420, 409, 468, 477
* 51 గోషామహల్ అభిషేక్ కుమార్ కంటేకర్ ఇండిపెండెంట్ ఐపీసీ 147, 148 కోర్టు విచారణలో ఉంది
* 51 గోషామహల్ మనోజ్ సింగ్ సీపీఐ(ఎం) ఐపీసీ 324, 506 కోర్టు విచారణలో ఉంది.
* 54 జహనుమా ఖాజా ముబషీర్ ఉద్దీన్ ఎంఐఎం ఐపీసీ 447, 504, 506 కోర్టు విచారణలో ఉంది
* 56 కిషన్‌బాగ్ మహమ్మద్ సలీమ్ ఎంఐఎం ఐపీసీ 147, 148, 324, 34 కోర్టు విచారణలో ఉంది
* 64 దత్తాత్రేయనగర్ మహమ్మద్ అక్విల్ టీఆర్‌ఎస్ కోర్టులో ఒక కేసు
* 65 కార్వాన్ డివిజన్ కె.గోవర్ధన్ బీజేపీ ఐపీసీ 324
* 77 జామ్‌బాగ్ ఆనంద్ గౌడ్ టీఆర్‌ఎస్ ఐపీసీ 406, 429 కోర్టులో పెండింగ్
* 77 జామ్‌బాగ్ ముల్లా విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ యూ/ఎస్ 364 (ఏ), 386 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ
* 70 మెహదీపట్నం ఎండీ మాజీ హుసేన్ ఎంఐఎం రెండు కేసులు (ఐపీసీ 353, 448, 504, 323)
* 71 గుడిమల్కాపూర్ బంగారి ప్రకాశ్ టీఆర్‌ఎస్ ఐపీసీ 353, కోర్టు విచారణలో ఉంది.
* 83 అంబర్‌పేట్ ప్రతాప్ పొగులకొండ కాంగ్రెస్ కోర్టులో కేసు

* 88 బోలక్‌పుర్ భానుచందర్ ముదిరాజ్ బీఎస్‌పీ కోర్టులో కేసు
* 88 బోలక్‌పుర్ జి.అనిల్‌కుమార్ బీజేపీ కోర్టులో కేసు
* 91 ఖైరతాబాద్ పి.విజయారెడ్డి టీఆర్‌ఎస్ కోర్టులో కేసు
* 93 బంజారాహిల్స్ పి.రాజు యాదవ్ కాంగ్రెస్ కోర్టులో కేసు
* 94 షేక్‌పేట అత్మకూరి సుధాకర్ కాంగ్రెస కోర్టులో కేసు
* 94 షేక్‌పేట్ మహమ్మద్ నవాజ్‌ఖాన్ ఇండిపెండెంట్ ఐపీసీ 448, 323, 506
* 94 షేక్‌పేట్ ఎస్.విజయ్‌కుమార్ టీఆర్‌ఎస్ కోర్టులో రెండు కేసులు
* 96 యూసఫ్‌గూడ ఏ.సురేందర్ యాదవ్ కాంగ్రెస్ ఎఫ్‌ఐఆర్ నంబర్ 386/2014
* 99 వెంగళ్‌రావు నగర్ వి.ప్రదీప్ టీడీపీ కోర్టులో ఒక కేసు
* 99 వెంగళ్‌రావు నగర్ ఎం.శ్యాంరావు ఎంఐఎం ఐపీసీ 147, 427, 506
* 102 రహమత్‌నగర్ నవీన్ యాదవ్ ఎంఐఎం ఐపీసీ 147,148,149,326,427,506
* 102 రహమత్ నగర్ బి.చంద్రమ్మ కాంగ్రెస్ ఐపీసీ 171(బీ), 171(ఈ)
* 103 బోరబండ జి,అర్జున్ రాజు ఇండిపెండెంట్ ఐపీసీ 353
* 103 బోరబండ బాబా ఫయాజుద్దీన్ టీఆర్‌ఎస్ అండర్ సెక్షన్ 147,353,427, 505, ఐపీసీ 149
* 104 కొండాపూర్ నీలం రవీందర్ ముదిరాజ్ టీడీపీ ఐపీసీ 186, 353, ఐపీసీ 188 అండ్ 171-హెచ్-ఐపీసీ
* 106 శేరిలింగంపల్లి ఆర్.నాగేందర్ యాదవ్ టీఆర్‌ఎస్ ఐపీసీ 420, 468, 471, కోర్టు విచారణలో ఉంది
* 106 శేరలింగంపల్లి కంచెర్ల యెల్లేశ్ కాంగ్రెస్ ఐపీసీ 186, 353, ఆర్/డబ్ల్యూ 34
* 107 మాదాపూర్ ఈ శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఐపీసీ 353, 332, 34

* 107 మాదాపూర్ ఎస్.హరికృష్ణ ప్రసాద్ బీజేపీ ఐపీసీ 353 (వినాయక చవితిలో గొడవ)
* 109 హఫీజ్‌పేట్ సౌజన్య కమాల్ టీడీపీ ఎస్‌సీ, ఎస్‌టీ (పీవోఏ) యాక్ట్ 1989, ఐపీసీ 504
* 112 రామచంద్రాపురం కె.మనోహర్ ఇండిపెండెంట్ కోర్టులో రెండు కేసులు విచారణలో ఉన్నాయి
* 112 రామచంద్రాపురం టి.అవినాశ్‌గౌడ్ కాంగ్రెస్ ఐపీసీ 447, 504
* 114 కేపీహెచ్‌బీ కాలనీ ఏ.వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్ ఐపీసీ 447, 427 (రెండు కేసులు కోర్టు విచారణలో)
* 116 అల్లాపూర్ స్రవంతి వేముల టీడీపీ ఐపీసీ 441, 447, 467
* 117 మూసాపేట్ జబ్బర్‌ఖాన్ ఎస్‌పీ ఐపీసీ 419, 420
* 119 ఓల్డ్‌బోయిన్‌పల్లి నరింహ్మ యాదవ్ టీఆర్‌ఎస్ ఐపీసీ 171(హెచ్), ఆర్‌పీ చట్టం 127(ఏ), ఐపీసీ 188
* 121 కూకట్‌పల్లి కూన అంబ్రిష్‌గౌడ్ కాంగ్రెస్ సీసీ నంబర్ 605/2013యూ/ఎస్326 ఐపీసీ
* 125 గాజుల రామారం పి.వీరాశెట్టి ఇండిపెండెంట్ ఐపీసీ 320, వికారాబాద్
* 129 సూరారం ఏ.శ్రీనివాస్ రావు ఇండిపెండెంట్ ఐపీసీ 447, 427, 323, 290, 506
* 129 సూరారం మన్నెరాజు టీడీపీ ఐపీసీ 120, 420 అండర్ సెక్షన్
* 129 సూరారం ఆనంద్‌కుమార్ ఇండిపెండెంట్ ఐపీసీ 498
* 130 సుభాష్‌నగర్ బుసిరెడ్డి వాణి ఇండిపెండెంట్ ఐపీసీ 534, 448
* 131 కుత్బుల్లాపూర్ టి.బాలమణి టీడీపీ ఐపీసీ 341,353, 34 కోర్టు ట్రయల్
* 133 బొల్లారం ఎన్.చిట్టిబాబు టీడీపీ ఐపీసీ 188, 427, అల్వాల్ పోలీసు స్టేషన్
* 140 మల్కాజిగిరి ఎం.విజయ్‌కుమార్ యాదవ్ టీడీపీ ఏపీ గేమ్ యాక్ట్ యూ/ఎస్ 3,45 కింద రెండు కేసులు
* 140 మల్కాజిగిరి జగదీశ్వర్ గౌడ్ టీఆర్‌ఎస్ ఐపీసీ 147, 341, 504 స్పెషల్ మేజిస్ట్రేట్‌లో ట్రయల్.

English summary
Forum for Good Governance releases Candidates with Criminal records.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X