రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.
బీఆర్ఎస్ శాసనసభ్యులు సీఎంను కలవడంతో సర్వత్రా చర్చకు దారితీసింది. ఇందులోనూ కొత్త ప్రభాకర్ అపాయింట్‌మెంట్ తీసుకోగా, మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిసి వెళ్లి, ముఖ్యమంత్రిని కలిశారు. అయితే తాము మర్యాద పూర్వకంగానే కలిసినట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద గన్‌మెన్ల అంశాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఈ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగానే కలిసినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాల్లో వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారు హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరుపుతోంది. అక్రమాలు తేలితే బీఆర్ఎస్ బడా నేతలు జైలుకే అంటూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మంత్రులు ప్రకటిస్తుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్‌లో చేరతారంటూ గులాబీ పార్టీ నేతలు చెబుతుండటం రాజకీయంగా చర్చకు దారిస్తోంది. మరోవైపు, లోక్‌సభ ఎన్నికల తర్వాత సుమారు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించడం గమనార్హం.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
గోల్కొండ తారామతి రిసార్ట్ లో డ్రగ్స్ పార్టీ, బాలీవుడ్ నటులు, ఈగల్ టీమ్ షాకింగ్ రైడ్! -
బాసరలో వీఐపీ వాహనాలకు సైతం నో ఎంట్రీ -
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి..












Click it and Unblock the Notifications