తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్ అధికారుల రిలీవ్: ఏపీ నుంచి ఇద్దరు
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాణి ప్రసాద్, వాకాటి కరుణలను తెలంగాణ ప్రభుత్వం బుధవారం సాయంత్రం రిలీవ్ చేసింది. దీంతో ఈ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెయిల్ ద్వారా రిపోర్టు చేయనున్నట్లు సమాచారం.
కాగా, పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఐఏఎస్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు క్యాట్, హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఏపీకి వెళ్లాల్సిన వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు.

ఈ క్రమంలో ఆమ్రపాలి స్థానంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంఛార్జీ కమిషనర్‌గా రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌కు, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శిగా టీకే శ్రీదేవికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
మరోవైపు, ప్రభుత్వ ఆదేశాలతో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా ఆర్ వీ కర్ణన్, ఆయుష్ డైరెక్టర్ గా క్రిస్టినా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇది ఇలావుండగా, ఏపీ నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారులు సృజన, హరికిరణ్, శివశంకర్ తెలంగాణ సీఎస్ శాంతికుమారికి రిపోర్టు చేశారు.
కాగా, అంతకుముందు, డీవోపీటీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఐఏఎస్ అధికారులకు హైకోర్టులో కూడా ఊరట దక్కలేదు. తెలంగాణలో పనిచేస్తున్న వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలిని ఏపీకి, అక్కడ పనిచేస్తున్న సృజన, శివశంకర్, హరికిరణ్ తెలంగాణకు వెళ్లాల్సిందేనని ఇటీవల కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ, డీవోపీటీ ఆదేశించిన విషయం తెలిసిందే.
డీవోపీటీ ఉత్తర్వులపై క్యాట్ స్టే ఇవ్వకపోవడంతో.. బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు ఈ ఐఏఎస్‌లు. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ ఆలిశెట్టి ధర్మాసనం విచారణ జరిపింది. ఐఏఎస్ ల తరపున న్యాయవాదులు తమ వాదనలను కోర్టుకు వినిపించారు. క్యాట్ తుది తీర్పు ఇచ్చే వరకు తమను రిలీవ్ చేయవద్దని కేంద్రాన్ని, రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించాలని ఐఏఎస్ అధికారులు కోరారు. నవంబరు 4న క్యాట్ తదుపరి విచారణ ఉన్నందున, కనీసం అప్పటి వరకైనా ఆగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
అయితే, ఐఏఎస్ అధికారుల వాదన సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదించారు. ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలని పరిపాలన వ్యవస్థ నిర్ణయిస్తుందని.. కోర్టులు జోక్యం చేసుకోవద్దన్నారు. స్టే ఇవ్వకూడదన్న క్యాట్ నిర్ణయం సరైనదేనని కేంద్రం వాదించింది. కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాలన్న తమ ఉత్తర్వులు ఏ విధంగా సమర్థనీయమో పూర్తి వివరాలతో క్యాట్‌లో కౌంటర్లు దాఖలు చేస్తామని ఏఎస్జీ తెలిపారు. ఈ వాదనల సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
సమాఖ్య దేశంలో రాష్ట్రాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. రెండు రాష్ట్రాల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి మరోసారి పరిశీలించాలని డీవోపీటీని ఆదేశించమంటారా? అని ఒక దశలో అభిప్రాయం అడిగింది. అయితే వివాదం తర్వాత తేలుతుంది కానీ, ముందయితే అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రంలో చేరాలని స్పష్టం చేసింది. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎప్పటికీ తేలదని వ్యాఖ్యానించింది. బాధ్యతాయుతమైన అధికారులు.. ప్రజలకు ఇబ్బంది కలగనీయవద్దని పేర్కొంది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం ఐఏఎస్ అధికారుల పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications