ర్యాగింగ్ కేసు: హెయిర్ డై తాగి ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలోని కమాన్ పూర్ మండలంలో సెంటినరీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. హెయిర్ డై తాగి వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులిద్దరితో పాటు ఇద్దరు పిల్లలు ఈ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు.
కొడుకుని అనవసరంగా ర్యాగింగ్‌లో ఇరికించారని నమస్తాపంతో గురైన కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ఆదిలాబాద్ జిల్లాలోని ఓ కాలేజీలో మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.

వీరిని గమనించిన స్థానికులు సమీపంలోని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వైద్యం వికటించి శిశువు మృతి
నల్గొండ జిల్లాలోని సూర్యపేటలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications