నేడు మేడిగడ్డ సందర్శనకు నలుగురు మంత్రులు; కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్!!
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని ప్రకటించిన మంత్రుల బృందం నేడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన చేయనుంది.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ వంగడం, అన్నారం బ్యారేజ్ లో డిజైన్ లోపాలు, పిల్లర్ కింద బుంగ ఏర్పడడం వంటి అంశాల పైన వారు నేడు నేరుగా పరిశీలన చేయనున్నారు.

అనంతరం మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అయిన వ్యయం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్, ప్రస్తుతం అవుతున్న ఖర్చు, దీనివల్ల సాగునీరు అందుతున్న ఆయకట్టు వివరాలు అన్నింటిని చెప్పనున్నారు. ఇక ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్న మంత్రుల షెడ్యూల్ విషయానికి వస్తే
ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి 11:30 గంటలకు మేడిగడ్డ కు చేరుకుంటారు. అక్కడ ఒంటిగంట వరకు ఈ ఎన్సి ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతోపాటు, మేడిగడ్డ బ్యారేజీ పై ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రెండు గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీ సందర్శించి క్యాంపు కార్యాలయానికి తిరిగి వెళతారు.
3గంటల నుండి 3గంటల 20 నిమిషాల వరకు మేడిగడ్డ నుండి అన్నారం బ్యారేజ్ ని పరిశీలిస్తారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి, ఐదు గంటల 20నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి తిరిగి చేరుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగిన లాభనష్టాలను వివరించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మంత్రులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్నారు.
అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ సంస్థలకు, సబ్ కాంట్రాక్టర్లకు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న వారందరికీ సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు ఇప్పటికేఈ ఎన్ సి ని ఆదేశించారు. నేడు మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పై వారు ఏమి చెప్పబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications