Road Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..
హైదరాబాద్ శివారు నార్సింగ్‍లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగరు విద్యార్థులు మృతి చెందారు. చనిపోయిన వారంతా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్ కూకట్ పల్లి, నిజాంపేట, బాచుపల్లికి చెందిన కొంత మంది స్నేహితులు హాలీడేస్ లో ఎంజాయ్ చేయటం కోసం ప్లాన్ చేసుకున్నారు.
7 సీటర్ కారును తీసుకుని.. అందులో 12 మంది ఎక్కారు. ప్రసాద్ యువకుడు కారు డ్రైవ్ చేస్తున్నాడు. వారంతా యువతీయువకులు కావడంతో కారు స్పీడ్ తో వెళ్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో కారు బస్సును ఓవర్ టెక్ చేయబోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్న ఫలితం లేకపోయింది. కారు 100 కిలోమీటర్ల స్పీడ్ ఉండడంతో లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదస్థలిలోనే హర్షిత, అంకిత అనే సొంత అక్కాచెల్లెళ్లతో పాటు నితిన్, అమృత్ మృతి చెందడం స్థానింగా విషాదం నింపింది. ప్రమాదంలో గాయపడిన వారిని మెహదీపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అసలు కారు నడిపిన ప్రసాద్ కు లైసెన్స్ ఉందా.. అతను మేజరా లేక మైనరా.. అతనికి కారు ఎవరు ఇచ్చారు అనే దానిపై విచారిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరోవైపు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో చనిపోయి అంకిత, హర్షిత పేరంట్స్ ఇంకా షాక్ లోనే ఉన్నారు. తమ పిల్లలు చనిపోడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications