స్కూల్లో దారుణం: 4వ తరగతి విద్యార్థినికి వాచ్‌మెన్ లైంగిక వేధింపులు..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: దేశంలో మహిళలపై వేధింపుల ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతూనే ఉన్నాయి. తాజాగా నగరంలోని ఓ కార్పోరేట్ స్కూల్లో నాలుగో తరగతి విద్యార్థినిపై కాలేజీ వాచ్ మెన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళ్తే.. అబిడ్స్ లోని సుజాత స్కూల్లో ఓ విద్యార్థిని నాలుగో తరగతి చదువుతోంది. స్కూల్లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది.

fourth class student allegedly sexually harassed in school

అసభ్య సైగలు చేస్తూ ఇబ్బందిపెడుతున్నాడని పేర్కొంది. దీంతో బాలిక తల్లిదండ్రులు విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినా సరే యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అబిడ్స్ పోలీసులను ఆశ్రయించి బాలిక తల్లిదండ్రులు కేసు నమోదు చేయించారు.

బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్న పోలీసులు వాచ్‌మెన్‌పై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కార్పోరేట్ స్కూళ్లలో బాలికలపై వేధింపుల ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. యాజమాన్యం స్పందించకపోవడంపై వారు మండిపడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A student, who is studying fourth class in a corporate school allegedly sexually harassed by watchman

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి