మంత్రి సబితా ఇంద్రారెడ్డి పీఏలమంటూ ఘరానా మోసం.. ఓ ప్రముఖ సంస్థకు టోకరా!!

తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పీఏలమంటూ మంత్రి పేరు చెప్పు కొంతమంది ఘరానా మోసానికి పాల్పడ్డారు. హర్యానా రాష్ట్రంలోని కర్నైల్ పట్టాణానికి చెందిన లిబర్టీ షూస్ లిమిటెడ్ సంస్థ 2019లో తెలంగాణా రాష్ట్రంలో అమలవుతున్న సర్వ శిక్షా అభియాన్ లో భాగంగా స్కూల్ చిన్నారులకు స్కూల్ బ్యాగ్స్, షూస్ పంపిణీకి సంబంధించిన ఆర్డర్ తమకు కేటాయించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.

గతంలో సబితా ఇంద్రారెడ్డి వద్ద పనిచేసిన కొందరు తాము సబితా ఇంద్రారెడ్డి పీఏలమంటూ లిబర్టీ సంస్థ ప్రతినిధి కమల్ ధవన్ కు ఫోన్ చేసి డీల్ చేసుకుందాం రమ్మని హైదరాబాద్ పిలిచారు. విద్యాశాఖామంత్రి పర్సనల్ అసిస్టెంట్ ను అంటూ జీ.కే కుమార్, సెకండ్ పర్సనల్ అసిస్టెంట్ అంటూ బెల్లి తేజ, పొలిటికల్ సెక్రటరీ అంటూ ప్రవీణ్ వర్మ లిబర్టీ ప్రతినిధిని పిలిచి ఈ కాంట్రాక్ట్ వారికే ఇస్తామని చెప్పారు.

 sabitha indra reddy

అందుకు ప్రాసెసింగ్ ఫీజులతో పాటు, ఇతర చార్జీల క్రింద 17.66లక్షల రూపాయలను వసూలు చేశారు. వివిధ ఖాతాలకు ఆ డబ్బులు బదిలీ చేయించారు. ఇక అప్పటినుండి ఇప్పటివరకు లిబర్టీ సంస్థ తమకు కాంట్రాక్ట్ వస్తుందని చూసినా ఆ ఆర్డర్ వారికి రాలేదు. దీంతో అసలు తమవద్ద డబ్బులు వసూలు చేసిన వారి గురించి తెలుసుకోగా జీ.కే కుమార్ గతంలో మంత్రి పీఏగా పనిచేశారని, కానీ ప్రస్తుతం పని చేయటంలేదని తెలిసింది.

దీంతో తమను మోసం చేసిన సదరు వ్యక్తులపై లిబర్టీ షూస్ లిమిటెడ్ ప్రతినిధి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం ఏడుగురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీ.కే కుమార్, బెల్లి తేజ, ప్రవీణ్ వర్మ, స్వాతి, ఆంజనేయులు, రమేష్ రెడ్డి, విక్రమ్ పురి తదితరులపై ఐపీసీ 406, 420 సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 sabitha indra reddy

ఏకంగా మంత్రి పేరే చెప్పుకుని ఘరానా మోసానికి పాల్పడిన నేరస్తులపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఎదుటి వారి అవసరాలను అవకాశాలుగా మార్చుకుని మోసం చేసే వారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అందుకే ఇలాంటి వారిపట్ల తస్మాత్ జాగ్రత్త.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+