వారికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆర్టీసీ.. మహిళలకే కాదు వారికి బస్సులు ఫ్రీ!
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సేవలలో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. రాష్ట్రంలో మహిళలు, బాలికలు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో తెలంగాణ సరిహద్దులలోపు ఎక్కడి నుంచైనా జీరో టికెట్‌తో ప్రయాణించవచ్చు. అంతర్రాష్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులకైతే సరిహద్దు వరకు ఈ సౌకర్యం వర్తిస్తుంది.
మహిళలకే కాదు వారికి ఫ్రీ బస్సులు
మహిళలకు మాత్రమే కాదు కొందరు పురుషులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలిగించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ పురుషులు, బాలురకు కూడా ఈ సౌకర్యం కల్పించాలంటూ కొంతకాలంగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న వేళ తెలంగాణా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీలో కూడా ప్రభుత్వం దివ్యాంగులకు ఇంద్రధనుస్సు పేరుతో నిన్నటి నుండి ఉచిత బస్సు ప్రయాణాలను ప్రారంభించింది.

జీరో టికెట్ తోనే వారికి ప్రయాణ సేవలు
తాజాగా దివ్యాంగుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, రాష్ట్ర దివ్యాంగ పురుషులకు ఆర్టీసీ బస్సుల్లో 100శాతం ఉచిత ప్రయాణం కల్పిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో దివ్యాంగ పురుషులు టికెట్ ధరలో 50శాతం రాయితీతో ప్రయాణం చేసేవారు. ఉదాహరణకు, రూ. 50 టికెట్‌కు రూ. 25 చెల్లింపు చేయాల్సి ఉండేది. ఇప్పుడు మహిళల మాదిరిగా జీరో టికెట్‌తో ఎలాంటి చెల్లింపులు లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించింది రేవంత్ సర్కార్.
హర్షం వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు
రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ప్రయాణం తమకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తుందని వారు పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమయ్యాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 25-30 లక్షలున్న ప్రయాణాలు తాజాగా 60 లక్షలకు చేరాయి.
బాగా పెరిగిన ఆర్టీసీ రద్దీ
ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో పెరిగిన రద్దీ దృష్ట్యా ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈవీ బస్సులు పలు మార్గాల్లో నడుస్తుండగా, త్వరలో మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే మహిళా సంఘాల ద్వారా కొన్న అద్దె బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయి.
-
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!











Click it and Unblock the Notifications