ఇకపై ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఉచిత ఎంఆర్ఐ సేవలు.. పైలెట్ ప్రాజెక్ట్ అక్కడే!

రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎంఆర్‌ఐ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని అమలు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌కు విస్తరించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

పీపీపీ విధానంలో ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చే పేషెంట్లకు ఈ పరీక్షలు పూర్తిగా ఉచితంగా అందుతాయని మంత్రి స్పష్టం చేశారు.
తాజాగా కోటిలోని టీజీఎంఎస్‌ఐడీసీ కార్యాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో ఎంఆర్‌ఐ సేవల నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలపై డాక్టర్లు, అధికారుల బృందం ఇతర రాష్ట్రాల్లో పర్యటించి, అక్కడ అవలంభిస్తున్న పద్ధతులపై స్టడీ చేసింది.

Free MRI Services in Govt Hospitals Telangana to Launch Free MRI Services in Govt Hospitals Under PPP Mode - Pilot at Mahbubnagar GGH

ఆ స్టడీ వివరాలు, పీపీపీ విధానంతో పేషెంట్లకు కలిగే ప్రయోజనం, రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించే అవకాశాలపై చర్చించారు. ప్రస్తుతం అమలవుతున్న విధానంతో పోలిస్తే పీపీపీ విధానంలో ప్రభుత్వానికి సుమారు 20 శాతం మేర ఖర్చు తగ్గుతుందని అధికారులు మంత్రికి వివరించారు. ఈ విధానం ద్వారా ఎంఆర్‌ఐ యంత్రాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించడంతో పాటు పేషెంట్లకు ఎలాంటి అంతరాయం లేకుండా సేవలు అందించవచ్చని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌, ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్‌తో పాటు వరంగల్‌లోని ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్‌, భూపాలపల్లి జీజీహెచ్‌లలో మాత్రమే ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఈ సదుపాయం లేదు.

మరోవైపు, ఎంఆర్‌ఐ యంత్రాల కొనుగోలు, నిర్వహణకు అధిక వ్యయం కావడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఇప్పటికే ఈ సేవలు అందుబాటులో ఉన్న హాస్పిటల్స్‌లోనూ అప్పుడప్పుడు అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా పేషెంట్లు ప్రైవేటు హాస్పిటల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై వైద్యులు, ఆరోగ్యశాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం అధ్యయనం చేసింది.

తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న పీపీపీ విధానాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చే పేషెంట్లకు అత్యాధునిక వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలని, ఆర్థిక కారణాలతో ఎవరూ వైద్య పరీక్షలకు దూరం కాకూడదని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో సేవల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగించినప్పటికీ, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎంఆర్‌ఐ పరీక్షలు పూర్తి ఉచితంగా అందేలా ఒప్పందాలు, విధివిధానాలు రూపొందించాలని సూచించారు.

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌.. గరిష్ఠంగా రూ.1.10 లక్షలు జమ!
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌.. గరిష్ఠంగా రూ.1.10 లక్షలు జమ!

సేవల నాణ్యత, యంత్రాల నిర్వహణ, రిపోర్టులు వేగంగా అందించడం వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్ జీజీహెచ్‌లో పైలట్ ప్రాజెక్టు అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టి, దాని ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జీజీహెచ్‌లలో ఎంఆర్‌‌ఐ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+