వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ బ్యాక్ టు బిజినెస్: చంద్రబాబుతో మనసువిప్పి మాట్లాడారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అయిదు రోజుల పాటు డిసెంబర్ 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆయుత చండీయాగం నిర్వహించారు. అనంతరం ఆయన పూర్తిస్థాయిలో పాలన పైన దృష్టి సారిస్తున్నారు.

కెసిఆర్ ఒక్కసారిగా బిజీబిజీ అయ్యారు. అధికారిక సమావేశాలు, సమీక్షలు, నిర్ణయాలతో కెసిఆర్ తీరిక లేకుండా గడుపుతున్నారు. మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. వచ్చే నెలలోనే బడ్జెట్ సమావేశాల్ని నిర్వహించనున్నందున బడ్జెట్‌పై ఉన్నతాధికారులు, మంత్రులతో భేటీ అయ్యారు.

వచ్చే వారం మెదక్, వరంగల్ జిల్లాల్లో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయి. బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, గ్రేటర్ ఎన్నికల నగారా కూడా జనవరి మొదటివారంలోనే మోగనున్నందున, వాటిపై సమగ్ర చర్చకోసం మూడో తేదీన టీఆర్‌ఎస్‌ఎల్పీ విస్తృత భేటీ ఏర్పాటు చేశారు.

అంతకు ముందు రోజు జనవరి 2న మంత్రివర్గం కూడా సమావేశం జరగనుంది. 4, 5 తేదీల్లో వరంగల్ జిల్లాలో, 7న మెదక్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. మంగళవారం తనను కలిసిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నప్పుడు వరంగల్ ఉపఎన్నిక ఫలితం ప్రస్తావనకు వచ్చింది.

వరంగల్‌లో వచ్చినవి కేవలం కష్టపడితే వచ్చిన ఓట్లు కాదని, ప్రజలు ఇష్టపడి వేసినవని, ప్రజలు మన బాధ్యతను మరింత పెంచారని కెసిఆర్ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

మంత్రివర్గ సమావేశంలో అనేక కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్‌ను కొత్త పంథాలో రూపొందించనున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఆ దిశగా కెసిఆర్ మార్గనిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది? ఏయే వనరుల నుంచి నిధులు ఎంత సమకూరుతాయి? అన్న అంశాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు.

రెవెన్యూ రాక, ఆర్థిక బిల్లుల ఆమోదం, విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా సీఎంవోకు అనుసంధానం చేసే ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని విభాగాల్లో నిధులు ఖర్చు కాకుండా మిగిలిపోవడం, మరికొన్ని విభాగాలు నిధులకు మొఖం వాచి ఎదురు చూడడంవంటి పరిస్థితి ఎందుకు వస్తున్నదో ఆరా తీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కెసిఆర్ పుష్పగుచ్చ

కెసిఆర్ పుష్పగుచ్చ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం నాడు రాజ్ భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యం.

రాజ్ భవన్

రాజ్ భవన్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు. కెసిఆర్ చాలా ముదుగానే వచ్చి, వరుసగా అందరినీ పలకరిస్తూ కరచాలనం చేస్తూ ఉల్లాసంగా కనిపించారు.

రాజ్ భవన్

రాజ్ భవన్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో మంగళవారం సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి పలువురి అభివాదం.

రాజ్ భవన్

రాజ్ భవన్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో మంగళవారం సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ సతీమణి విమలా నరసింహన్‌తో మహిళా నేతలు.

రాజ్ భవన్

రాజ్ భవన్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు వచ్చారు.

చంద్రబాబు, కెసిఆర్ నవ్వుతూ..

చంద్రబాబు, కెసిఆర్ నవ్వుతూ..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో మంగళవారం సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కెసిఆర్, రాష్ట్రపతిలు నవ్వుకుంటూ...

రాజ్ భవన్

రాజ్ భవన్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో మంగళవారం సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో రాష్ట్రపతి, తెలంగాణ సీఎం, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తదితరులు.

రాజ్ భవన్

రాజ్ భవన్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో మంగళవారం సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. సమావేశంలో తెలంగాణ సీఎం కెసిఆర్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలు.

మర్రి శశిధర్ రెడ్డి

మర్రి శశిధర్ రెడ్డి

మంగళవారం నాడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి పుష్పగుచ్ఛం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి.

గీతా రెడ్డి

గీతా రెడ్డి

మంగళవారం నాడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి పుష్పగుచ్ఛం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ గీతా రెడ్డి.

జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి

జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి

మంగళవారం నాడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి పుష్పగుచ్ఛం ఇస్తున్న జస్టిస్ ఎల్ నర్సింహా రెడ్డి.

ఎంఎం రాజా

ఎంఎం రాజా

మంగళవారం నాడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి పుష్పగుచ్ఛం ఇస్తున్న డాక్టర్ ఎంఎం రాజా. ఇతను రాష్ట్రపతికి ది పవర్ ఆఫ్ జెమ్స్ అనే పుస్తకాన్ని బహూకరించారు.

జ్యోతి రెడ్డి

జ్యోతి రెడ్డి

మంగళవారం నాడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి పుష్పగుచ్ఛం ఇస్తున్న లెర్న్ టు లివ్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ జ్యోతి రెడ్డి.

మధులిక

మధులిక

మంగళవారం నాడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి పుష్పగుచ్ఛం ఇస్తున్న పీవీ నర్సింహారావు మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి మధుళిక.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ

మంగళవారం నాడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీని కలిసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీ జెజె సత్యనారాయణ తదితరులు.

వెంకటేశ్వర్లు

వెంకటేశ్వర్లు

మంగళవారం నాడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీని కలిసిన చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు.

English summary
Chief Minister K Chandrasekhar Rao was back to work on Tuesday, the Ayutha Chandi Maha Yagam at his Erravalli farmhouse keeping him away from the Secretariat for nearly a month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X