స్నేహం.. వీడియో చాట్, ఆపైన బ్లాక్ మెయిలింగ్, ఒప్పుకోలేదని ఏం చేశాడో తెలుసా?

స్నేహితుడే కదాని నమ్మి వీడియో చాట్ చేస్తే.. తనకు లొంగలేదనే కోపంతో ఆమె అభ్యంతరకరమైన దృశ్యాలను రికార్డ్ చేసి పోర్న్ వెబ్ సైట్లలోకి అప్ లోడ్ చేశాడు ఓ ప్రబుధ్దుడు.

హైదరాబాద్‌: ఓ యువతి ప్రైవేట్‌ వీడియోలను పోర్న్‌ వెబ్‌సైట్‌లలో పోస్టు చేసి వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లాకు చెందిన పాటిబండ్ల సంజయ్‌ ఓ ప్రైవేట్‌ టీవీ ఛానల్‌లో సౌండ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తూ సికింద్రాబాద్‌ కార్ఖానాలో నివాసముంటున్నాడు. ఎల్‌బీ నగర్‌కు చెందిన ఓ యువతి మిర్యాలగూడలో ఓ టీవీ సీరియల్‌ షూటింగ్‌ను చూసేందుకు వచ్చిన సందర్భంలో సంజయ్‌తో పరిచయం ఏర్పడింది. మొబైల్‌ నంబర్లు మార్చుకొని తరచూ చాట్‌ చేసుకోవడం మొదలెట్టారు.

man-arrest

కొన్నిరోజుల తర్వాత ఆ యువతిని మాటలతో కవ్వించి వీడియో చాట్‌ చేస్తున్న సమయంలో ఆమె ప్రైవేట్‌ భాగాలు చూపించేలా చేశాడు సంజయ్. ఆ సమయంలో ఆమెకు తెలియకుండానే వీడియో క్యాప్చరింగ్‌ అప్లికేషన్‌ను ఉపయోగించి వీడియో ఫుటేజ్‌ను రికార్డు చేశాడు.

ఆ తర్వాత అసలు కథ మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చాలని, లేకపోతే తాను క్యాప్చర్ చేసిన వీడియోను పోర్న్‌ వెబ్‌సైట్‌లో పెడతానని ఆమెను బెదిరించాడు. అలా చేయవద్దంటూ ఆమె అతడిని తీవ్రంగా మందలించింది.

ఆమె లొంగకపోవడంతో సంజయ్ ఆ యువతి వీడియోలను వివిధ పోర్న్‌ వెబ్ సైట్‌లలో పోస్టు చేశాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన పోలీసులు సికింద్రాబాద్‌ కార్ఖానాలో ఉన్న సంజయ్‌ను సోమవారం అరెస్టు చేసి అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఆ వీడియో లింక్‌లను తొలగించాలంటూ సంబంధిత పోర్న్ వెబ్‌సైట్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+