హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో రోడ్డెక్కిన జడ్జిలు: హైకోర్టు ఆగ్రహం, ఇద్దరు జడ్జిల సస్పెన్షన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇద్దరు న్యాయమూర్తుల పైన సోమవారం నాడు హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది. ఆప్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జడ్జిలు ఆదివారం నాడు చలో రాజ్ భవన్ నిర్వహించిన విషయం తెలిసిందే.

దీని పైన ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేసింది. దీనిపై తెలంగాణ న్యాయమూర్తులు, ఇతరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధిత న్యాయమూర్తులు, ఇతరులు కలిసి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా హైకోర్టు వద్ద ఆందోళన నిర్వహించారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. జడ్జిలకే న్యాయం చేయకుంటే సామాన్యులకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

రోడ్డెక్కిన జడ్జిలు

రోడ్డెక్కిన జడ్జిలు

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో దిగువ న్యాయవ్యవస్థలోని న్యాయాధికారుల కేటాయింపుల వ్యవహారంలో ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యాయాధికారుల కేటాయింపుల్లో ఆప్షన్ పేరిట తెలంగాణకు చేసిన అన్యాయంపై తెలంగాణ న్యాయాధికారులు మూకుమ్మడిగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

 రోడ్డెక్కిన జడ్జిలు

రోడ్డెక్కిన జడ్జిలు

మే 3వ తేదీన జారీచేసిన ప్రాథమిక కేటాయింపుల జాబితాను రద్దు చేయాలన్న తమ విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్నారని, న్యాయవ్యవస్థను శాసిస్తున్న ఆంధ్ర జ్యుడీషియల్ రూలర్స్ కింద పని చేయలేమంటూ తెలంగాణకు చెందిన 125 మంది న్యాయాధికారులు తమ రాజీనామాలను సంఘం అధ్యక్షుడికి సమర్పించారు.

రోడ్డెక్కిన జడ్జిలు

రోడ్డెక్కిన జడ్జిలు

బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములుగా ఉండి, ఆంధ్ర న్యాయమూర్తుల కబంధ హస్తాల్లో చిక్కుకపోయిన ఉమ్మడి హైకోర్టుకు సబార్డినేట్‌గా ఉన్న దిగువ కోర్టుల్లో న్యాయాధికారులుగా కొనసాగలేమని రాజీనామా లేఖల్లో తెలంగాణ జడ్జీలు పేర్కొన్నారు.

 రోడ్డెక్కిన జడ్జిలు

రోడ్డెక్కిన జడ్జిలు

కేటాయింపుల్లో న్యాయం లభిస్తుందనే అశలు వమ్ముకావడంతో వారు రాజీనామాలను గవర్నర్‌కు అందజేసే బాధ్యతను సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డికి అప్పగించారు. సమస్య పరిష్కారం కాకుంటే తమ రాజీనామాలను గవర్నర్ వద్ద ఆమోదింపజేసే బాధ్యత తీసుకోవాలని కోరారు.

రోడ్డెక్కిన జడ్జిలు

రోడ్డెక్కిన జడ్జిలు

న్యాయవ్యవస్థలో తెలంగాణకు అన్యాయం జరగనీయబోమని, అవసరమైతే హైకోర్టు ప్రాంగణంలోనే ఆమరణ నిరాహారదీక్షలు చేపడుతామన్నారు. ఆదివారం ఆబిడ్స్‌లో సమావేశమైన న్యాయాధికారులు అనంతరం గవర్నర్ వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

 రోడ్డెక్కిన జడ్జిలు

రోడ్డెక్కిన జడ్జిలు

ముందుగా అసెంబ్లీ ఎదురుగా గల గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. రెండు నిమిషాలు అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ మౌనం పాటించారు. అనంతరం ఎటువంటి నినాదాలు చేయకుండా నడుచుకుంటూ ర్యాలీగా బయలుదేరారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

రోడ్డెక్కిన జడ్జిలు

రోడ్డెక్కిన జడ్జిలు

న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల తీరును తెలియజేశారు. నగరంలో జరిగిన సమావేశానికి హాజరైన న్యాయాధికారులు రాజీనామా లేఖలు సమర్పించారు.

English summary
From Court Rooms To Streets, Telangana Judges March For Justice In Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X