రాజకీయం నుండి రాజ్యాంగం వరకు.!నో మ్యాటర్.!దేశ వ్యాప్తంగా చర్చ జరగాలంతే.!కేసీఆర్ తాజా స్కెచ్.!
హైదరాబాద్ : రాజకీయ నాయకులు కాలంతో పాటు అప్ డేట్ అవ్వడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జనరేషన్స్ మద్య గ్యాప్ ను ఫిల్ చేసి ఆమోదయోగ్యంగా తమ వ్యవహార శైలి ఉండేందుకు నిర్విరామంగా కృషి చేస్తుంటారు. అంతే కాకుండా రాజకీయాల్లో నిత్యం చర్చించుకునే విధంగా, ప్రసార మాద్యమాల్లో తరుచుగా తన పేరు వినిపించేం విధంగా మరికొంత మంది నేతలు ప్రయత్నాలు చేస్తుంటారు. మీడియాలో సదరు నేత గురించి ప్రధాన చర్చ జరిగితే దేశ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందనే భావనతో కొంత మంది నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలను, సంచలన వ్యాఖ్యలను సంబంధం లేకుండా వదులుతుంటారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎంత మేలు జరుగుతుందో అంతే కీడు కూడా జరుగుతుంది. ప్రస్తుతం దేశ ఉత్కృష్టమైన రాజ్యాంగ వ్యవస్థ మీద తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల వెనక ఓ బృహత్కర రాజకీయ వ్యూహం దాగుందటున్నాయి ప్రగతిభవన్ వర్గాలు.
Recommended Video

దేశం మారాలంటే రాజ్యాంగం మారాలె.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా దాంట్లో ఓ వ్యూహం దాగుందంటారు. యాదృచ్చికంగా, యధాలాంపంగా, ఏమరుపాటుగా, గ్రహపాటుగా, పొరపాటుగా చంద్రశేఖర్ రావు ఎప్పుడు కూడా రాజకీయ ప్రకటనలు చేయరని ఎన్నో ఉదంతాలు నిరూపిస్తున్నాయి. రాజకీయంగా చేసే ప్రకటనల తర్వాత వాటి పర్యవసానం ఎలా ఉంటుందో ఊహించే చంద్రశేఖర్ రావు రాజకీయంగా వ్యాఖ్యలు చేస్తారని తెలుస్తోంది. వరిధాన్యం కొనుగోలు అంశంలో తెలంగాణ బీజేపి ని, బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ ని చంద్రశేఖర్ రావు తూర్పారబట్టారు. తర్వాత కేంద్ర బీజేపి మంత్రులను ఏ ముఖ్యమంత్రీ దూషించని విదంగా దూషించారు చంద్రశేఖర్ రావు. ఇప్పడు మరికాస్త డోస్ పెంచి ప్రధాని మోదీని టార్గెట్ చేసారు చంద్రశేఖర్ రావు.

దేశం వృద్ది చెందాలంటే రాజ్యాంగంలో మార్పులు కాదు.. కొత్త రాజ్యాంగం కావాలన్న కేసీఆర్
కేంద్ర వార్షిక బడ్జెట్ లో కేటాయింపుల సందర్బంగా సీఎం చంద్రశేఖర్ రావు కేంద్ర బీజేపి ప్రభుత్వంపైన, ప్రధాని మోదీ విధానాలపైన శివతాండవం చేసారు. ప్రదాని నరేంద్ర మోదీ మీద, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీద రాజకీయ ఆరోపణలు చేస్తే ప్రసార మాద్యమాల్లో సంచలనంగా మారుతుందిగానీ దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగదని సీఎం చంద్రశేఖర్ రావు భావించినట్టు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో కలపాలని, మోదీని దేశం నుంచి తరిమికొట్టాలని చంద్రశేఖర్ రావు సంచనల వ్యాఖ్యలు చేసారు. ఐనప్పటికి అంతకు మించి అన్నట్టు భారత రాజ్యాంగం గురించి ప్రస్తావించి యావత్ భారతదేశ దృష్టని తెలంగాణ వైపు మళ్లించే ప్రయత్నం చేసారు సీఎం చంద్రశేఖర్ రావు.

రాజ్యాంగాన్ని అవమానించారు.. కేసీఆర్ పై భగ్గుమంటున్న నిరసనలు
నిన్నటి వరకూ తెలంగాణ బీజేపి గురించి, బండి సంజయ్ గురించి విరుచుకు పడ్డ చంద్రశేఖర్ రావు అకస్మాత్తుగా దేశ ప్రధాని మోదీ గురించి, మోదీ ప్రభుత్వం గురించి భగ్గుమన్నారు. అంతే కాకుండా అంతకు మించి అనే విధంగా భారత రాజ్యాంగం మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు ఎంతటి ప్రమాదకర పరిస్థితులకు దారితీసినప్పటికీ దేశ వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయక తప్పదని సీఎం భావించి అలాంటి వ్యాఖ్యలు చేసారని తెలుస్తోంది. అంతే కాకుండా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపి లను కాదని తృతీయ రాజకీయ వేదిక దేశానికి అవసరమని అనేక సందర్బాల్లో చంద్రశేఖర్ రావు వివరించారు. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా సంచలనం కావాలని చంద్రశేఖర్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేసారనే చర్చ కూడా జరుగుతోంది.

పక్కా రాజకీయ వ్యూహం.. తృతీయ వేదిక పెద్దల మెప్పుకోసమని కొట్టిపారేస్తున్నబీజేపి
దేశం అభివృద్దిలో పరుగులు పెట్టాలంటే బీజేపి, కాంగ్రెస్ వంటి పార్టీలకు ప్రత్యామ్నాయ వేదిక కావాలని, ఆ వేదిక రూపకల్పనలో తనది ప్రధాన భూమిక కావాలని చంద్రశేఖర్ రావు పరితపిస్తున్న అంశం అందరికి తెలిసిందే. అందులో భాగంగా దేశంలో బీజేపి, కాంగ్రెస్ పార్టీలంటే గిట్టని నేతలతో చంద్రశేఖర్ రావు గతంలో మంతనాలు జరిపారు. తృతీయ రాజకీయ వేదికకోసం చర్చలు కూడా జరిపారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ చంద్రశేఖర్ రావు సైలెంట్ అయిపోయారు. సుధీర్గ సమయం తర్వాత చంద్రశేఖర్ రావు, మళ్లీ కేంద్రంపైన కొత్త వ్యూహంతో ముందుకొచ్చారనే భావన బీజేపి, కాంగ్రెస్ పార్టీలను ఎదిరించే నేతలు భావించాలని ఏకంగా రాజ్యాంగం మీదనే సంచలన వ్యాఖ్యలు చేసారనే చర్చ జరగుతోంది. తృతీయ ఫ్రంట్ కోసం ఎదురుచూసే నేతల అభిప్రాయం ఎలా ఉన్నా, రాజ్యంగం పట్ల చంద్రశేఖర్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలపట్ల మాత్రం తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు కాదు.. ఒక్క నామినేషన్‌కు మూడు పార్టీలు! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications