వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో త్వరలో ఫుల్ బాడీ స్కానర్లు ...ఇక స్మగ్లింగ్ దొంగలకు కష్టమే

|
Google Oneindia TeluguNews

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకోవటం నిత్య కృత్యమైపోయింది. ఇది శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎయిర్ పోర్ట్ పోలీసులు, కస్టమ్స్ అధికారులకు తలనొప్పిగా మారింది. ఇక ఈ నేపధ్యంలోనే నిషేధిత వస్తువుల రవాణాకు చెక్ పెట్టటానికి శరీర భాగాలలో దాచినా సునిశితంగా పరిశీలించి పసిగట్టే బాడీ స్కానర్లను ఎయిర్ పోర్ట్ లో పెట్టనున్నారు.

ఇంటర్ బోర్డా మజాకా .. సప్లమెంటరీ పరీక్షలకు ఒకే స్టూడెంట్ కు రెండు హాల్ టికెట్స్ఇంటర్ బోర్డా మజాకా .. సప్లమెంటరీ పరీక్షలకు ఒకే స్టూడెంట్ కు రెండు హాల్ టికెట్స్

 బంగారం , నిషేధిత వస్తువుల స్మగ్లింగ్ కు చెక్ పెట్టే ఫుల్ బాడీ స్కానర్లు త్వరలో శంషాబాద్ విమానాశ్రయంలో

బంగారం , నిషేధిత వస్తువుల స్మగ్లింగ్ కు చెక్ పెట్టే ఫుల్ బాడీ స్కానర్లు త్వరలో శంషాబాద్ విమానాశ్రయంలో

దీంతో రోజురోజుకీ పెరుగుతున్న బంగారం అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు, ప్రయాణికుల భద్రతను కాపాడినట్టు అవుతుంది అని ఎయిర్ పోర్ట్ అధికారులు భావిస్తున్నారు. 2020 మార్చి నాటికి దేశంలోని 84 విమానాశ్రయాల్లో బాడీ స్కానర్లను అమర్చాలని కేంద్రం నిర్ణయిం చింది . ప్రస్తుతం విమానాశ్రయాల్లో డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్లు, హ్యాండ్‌ హెల్డ్‌ డివైజ్‌ ల ద్వారా, ఆపై తడిమి చూడటం (ఫ్రిస్కింగ్) ద్వారా తనిఖీలు జరుగుతున్నాయి. ఇక మీదట బాడీ స్కానర్ లు కూడా రానున్నాయి. ఇక శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో త్వరలోనే బాడీ స్కానర్లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తుంది.

ఆధునాతన టెక్నాలజీతో ఫుల్ బాడీ స్కానర్లు .. రోజురోజుకీ పెరుగుతున్న సంగ్లింగ్ , ప్రయాణీకుల భద్రత కోసమే ఈ నిర్ణయం

ఆధునాతన టెక్నాలజీతో ఫుల్ బాడీ స్కానర్లు .. రోజురోజుకీ పెరుగుతున్న సంగ్లింగ్ , ప్రయాణీకుల భద్రత కోసమే ఈ నిర్ణయం

కొన్ని సందర్భాల్లో నిషేధిత వస్తువుల ఆనవాళ్లు తడిమి చూడటం ద్వారా గుర్తించలేకపోతున్నారు. మహిళల విషయంలో మరీ ఇబ్బందికరంగా మారుతుంది. కొందరు స్మగ్లర్లు శరీర భాగాలలో బంగారం సర్జరీ ద్వారా పెట్టుకుని మరీ వస్తుంటే దాన్ని తడిమి చూసి గుర్తించటం వీలు కావటం లేదు. దీంతో బాడీ స్కానర్ల వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు ఏవియేషన్ అధికారులు. బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ ప్రమాణాల మేరకు త్వరలోనే ప్రయోగాత్మకంగా వీటిని పరీక్షించనున్నట్టు అధికారులు తెలిపారు. గతంలో న్యూఢిల్లీలోని ఐజీఏలో బాడీ స్కానర్లను ఏర్పాటు చేయగా, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకంతో పాటు, లేజర్‌ కిరణాల నుంచి వెలువడే రేడియేషన్‌ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందనే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వీటిని ఆపేశారు. అయితే ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో శరీరానికి ఎలాంటి హానీ లేకుండా , కేవలం ఎముకలు, శరీరంలో ఉన్న వస్తువులను స్కాన్ చేసేలా ఈ బాడీ స్కానర్ లను రూపొందించారు.

బాడీ స్కానర్లతో మహిళల వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలుగకుండా సోదాలు చేసే అవకాశం

బాడీ స్కానర్లతో మహిళల వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలుగకుండా సోదాలు చేసే అవకాశం

ఇక ఈ బాడీ స్కానర్లు మెటల్‌ డిటెక్టర్లు, సుశిక్షిత జాగిలాలు గుర్తించలేని నిషేధిత వస్తువులను సైతం పసిగడతాయి. అలాగే శరీరం లోపలి అవయవాల్లో దాచి ఉంచే బంగారం వంటి లోహాలనూ పట్టేస్తాయి. సెకన్ల వ్యవధిలోనే శరీరాన్ని స్కాన్ చేసే లేజర్‌ కిరణాలు, శరీర భాగాలను చూపించకుండా, కేవలం ఎముకలను మాత్రమే చూపుతాయి. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా ఈ విధానంలో సోదాలు చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

English summary
Passengers at Hyderabad airport are likely to be subjected to full body scan without any ‘exception’ and trial runs are expected to begin in a month’s time.Incidentally, a bid to install similar body scanners failed to take off earlier at the New Delhi airport, as objections were raised on account of breach of privacy and radiation risks.This time, however, authorities are asserting that ‘private parts’ will not be visible in the scans. “We will use machines which employee Millimetre Wave Technology, which is very common at airports and metro stations in the West, including the United States,” a senior security official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X